NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఘనతలు మాకన్నా.. ప్రజలకే ఎక్కువ తెలుసు..!

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఘనతలు మాకన్నా.. ప్రజలకే ఎక్కువ తెలుసు అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విభాగాలు అన్ని నష్టాల్లో వున్నాయన్నారు. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరాకు సాగు ఇవ్వలేదని మండిపడ్డారు. ఫామ్ హౌజ్ కి మాత్రమే ప్రయోజనం కలిగిందని మండిపడ్డారు. ముగ్గురు మంత్రులకు, ఇన్చార్జి మంత్రిగా తోడుగా వుంటానని అన్నారు. మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాలో రోడ్లు అన్ని కవర్ చేశారని..ఇంకా మిగిలిన వున్న వాటిని పూర్తి చేస్తామన్నారు. మేం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల అమల్లోకి తెచ్చేందుకు ఈ రివ్యూ అని క్లారిటీ ఇచ్చారు. నెల గడవకముందే గ్యారెంటీల అమలు దేశ చరిత్రలో ఇదే మొదలన్నారు. ఎదో తూ తూ మంత్రంగా కాకుండా పకడ్బందీగా అమలు చేసేలా పని చేస్తున్నామన్నారు.

Read also: Thummala Nageswara Rao: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినం..! కానీ..

ఇన్నాళ్లు తెలంగాన ద్వయంసం అయిందన్నారు. ఏ శాఖ చూసిన వేల కోట్లలో అప్పులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని గాడిలో పెట్టాలనే ఈ ఆత్రుత అన్నారు. నేనే ఇంజినీర్ అని గొప్పలు చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీడియా సభ్యులు కూడా కాళేశ్వరం గొప్పలు, దిబ్బలు చూడొచ్చని అన్నారు. త్వరలో మా మంత్రులు సందర్శనకు వెళ్తున్నారని తెలిపారు. ఎన్నో రిజర్వాయర్ లను అటుకున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం మాత్రం కమీషన్ కోసం హడావిడిగా ప్రారంభించారని తెలిపారు. దేశంలోనే అవమానపర్చేలా కాళేశ్వరం నిర్మాణం తీరన్నారు. కేసీఆర్ ఘనతలు మకన్నా ప్రజలకే ఎక్కువ తెలుసన్నారు. ఖమ్మం జిల్లాను వచ్చే 5 ఏళ్లలో 24/7 అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు.
Sriya Reddy: సలార్ శ్రియ రెడ్డి ఆ ఇండియన్ క్రికెటర్ కూతురు అని మీకు తెలుసా?