Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: అందుకే దిగ్విజయ్ సింగ్ ని కలిసా..

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి దిగ్విజయ్ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం దిగ్విజయ్ సింగ్ తో భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిన్న రాత్రి భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు నేను ఉండటం లేదు అందుకే దిగ్విజయ్ సింగ్ ని నిన్న కలిసా అన్నారు. నా మిత్రుడు టీటీడీ ఈవో కుమారుడు మరణించాడు వారికి సంతాపం తెలపడానికి ఇవాళ నందికొట్కూరు వెళ్తున్నట్లు తెలిపారు. 2018 ఎన్నికల తరువాత నుంచి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించా అన్నారు. 20 నిమిషాల పాటు పార్టీ పరిస్థితుల పై చర్చించానని తెలిపారు. పీసీసీతో పాటు ఇతర అంశాలపై చర్చించానని అన్నారు. వారు కొన్ని సూచనలు చేశారు.. నేను నా ఆలోచనని వారితో పంచుకున్నానని అన్నారు. తరువాత ఢిల్లీ వెళ్లి.. అక్కడ ఆయనతో కూర్చుని మాట్లాడుతా అన్నారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read also: Solar Stove : గ్యాస్ ధర పెరిగినా డోంట్ వర్రీ.. వచ్చేస్తోంది సోలార్ స్టవ్

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్ కు అప్పగించిందని తెలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చే ముందు దిగ్విజయ్ ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, ఇంచార్జులతో సమావేశమయ్యారు. మాణిక్యం ఠాగూర్ ఛాంబర్‌లో బోస్ రాజు, నదీమ్ జావేద్‌లతో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇన్ చార్జిల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ టీమ్‌తో పాటు సీనియర్లతో దిగ్విజయ్ భేటీ కానున్నారు. ఇరు వర్గాల వాదనలు తెలుసుకున్న దిగ్విజయ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. అలాగే పీసీసీ కమిటీల విషయంలో అసలు కాంగ్రెసోళ్లకే అన్యాయం జరిగిందన్న సీనియర్ నేతలు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏకంగా గళం విప్పారు.

Read also: Severity of Cold: వణుకుతున్న తెలంగాణ.. పెరిగిన చలి తీవ్రత

వలసదారులకే ఎక్కువ పోస్టులు దక్కాయని ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ నేపథ్యం ఉండి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ వర్గానికి చెందిన 12 మంది పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో టీ కాంగ్రెస్‌లో ఉత్కంఠ పెరిగింది. అసలైన కాంగ్రెస్ వర్సెస్ వలసవాద నాయకులు తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించారు. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ కొందరు సీనియర్ నేతలతో ఫోన్ లో మాట్లాడి అందరి వాదనలు వింటానన్నారు. అలాగే మంగళవారం సాయంత్రం జరగాల్సిన సీనియర్ నేతల ముఖ్యమైన సమావేశం రద్దయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా అసమ్మతి నేతలను పిలిచి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్ ను హైదరాబాద్ పంపుతామన్నారు. అలాగే సమన్వయం పాటించాలని నేతలకు సూచించినట్లు తెలిసింది.
Astrology : డిసెంబర్‌ 22, గురువారం దినఫలాలు

Exit mobile version