Site icon NTV Telugu

Big Breaking: బీజేపీకి కోమటిరెడ్డి రాజీనామా.. ఎల్లుండి కాంగ్రెస్‌లోకి..!

Komati Reddy Rajagipal Reddy

Komati Reddy Rajagipal Reddy

Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని సమాచారం. గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరనున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగలవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో వీరు పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి మునుగోడు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఈ విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వివేక్ కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరితే ప్లస్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Team India: వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..

Exit mobile version