Site icon NTV Telugu

Rajagopal Reddy Resigns as MLA: నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖ అందజేయనున్న రాజగోపాల్‌ రెడ్డి..! ఆమోదిస్తారా..?

Rajagopal Reddy Resigns As Mla

Rajagopal Reddy Resigns As Mla

Rajagopal Reddy Resigns as MLA: తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు అందుకు గల కారణాలను వివరిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు.. అందుకోసం స్పీకర్‌ అపాయిట్‌మెంట్‌ కోసం చూస్తున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖను అందించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్పీకర్‌ తనకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈనేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి రాజీనామను స్పీకర్‌ ఆమోదిస్తే..? ఆరు నెలల లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే రాజీనామా స్పీకర్‌ తనకు అందిన వెంటనే ఆమోదిస్తారా? లేదా న్యాయ సలహా తీసుకుని ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

read also: Sravana Putrada Ekadasi Live: శ్రావణ పుత్రదా ఏకాదశి శుభవేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ..

ఈ నేపథ్యంలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో ఎన్టీవీ ఇంటర్వ్యూ నిర్వహించిన విషయం తెలిసిందే.. అయితే ఇంటర్య్వూలో కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజల కోసం ఇద్దరం ఒకేరకంగా ఆలోచిస్తామని వెల్లడించారు. నా ఆలోచన, మా అన్నయ్య ఆలోచన ఒకటేనని, వెంకట్‌ రెడ్డి పార్టీ మార్పుపై పరోక్షంగా హింట్‌ ఇచ్చారు రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడు సమస్యలపై ఎన్నో సార్లు మాట్లాడాను. పత్రిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ప్రభుత్వం పట్టించుకోదు. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజాశక్తి గొప్పదని హుజురాబాద్‌లో ప్రజలు నిరూపించారు. నన్ను నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? అంటూ ప్రశ్నించారు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నా. ఈ తీర్పు ద్వారా తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని పేర్కొన్నారు. నేను బాధతోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నాకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమే అని ప్రస్తావించారు. మునుగోడు ప్రజలపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. మా దగ్గర అవినీతి సొమ్ము లేదని తెలిపారు. ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిని ముందు పెట్టాలని అధిష్టానాన్ని కోరామన్నారు. కాంగ్రెస్‌లో సరైన నాయకత్వం లేదు. నాయకత్వాన్ని లీడ్‌ చేసే వ్యక్తికి క్రెడబులిటీ, కెపాసిటీ ఉండాలి. కుంతియా గురించి వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడానని అన్నారు. . 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నాయకత్వాన్ని మార్చలేదు. పార్టీలో నాకు ఎలాంటి పదవి లేదు. అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version