Conflict between Congress MLA Komatireddy Raj Gopal Reddy and Minister Talasani Srinivas.
నేడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసబసగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో ఏ గ్రామం వెళ్ళినా.. గొంతెమ్మ కోర్కెలు కోరరని, చిన్న చిన్న కోర్కెలు.. డ్రైనేజ్.. రోడ్లు అడుగుతారన్నారు. పల్లె ప్రగతి.. బాగుంది.. కానీ అధికారులతో సర్పంచ్ ల మీద ప్రభుత్వం భారం మోపిందని ఆయన ఆరోపించారు. బిల్లులు చెల్లించక పోవడంతో సర్పంచ్ లు అప్పుల పాలు అయ్యారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారరి ఆయన అన్నారు.
ఏకగ్రీవంగా ఎన్నిక అయిన పంచాయతీలకు డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గ్రామ పంచాయతీలకు కూడా బలవంతంగా ట్రాక్టర్ లు కొనిచ్చారని ఆయన మండిపడ్డారు. తనను కాంట్రాక్టర్ అంటే నేనేమి బాధపడనని, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కావద్దా..? అని ఆయన ప్రవ్నించారు. కొంతసేపు అసెంబ్లీ సమావేశాల్లో రాజగోపాల్‌రెడ్డి, మంత్రి తలసాని మధ్య వాగ్వాద వాతవరణం చోటు చేసుకుంది.
https://ntvtelugu.com/nara-lokesh-reacts-on-jangareddygudem-incident/
