5th Day Telangana Assembly Budget Sessions. Congress MLA Komatireddy Raj Gopal Reddy Countered To Minister Jagadish Reddy Comments.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో.. సభలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. నేడు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో నేడు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాలుగు సింగరేణి కోల్ బ్లాక్ లు ప్రైవేటీకరణ కాకుడదని అసెంబ్లీలో అందరం మాట్లాడామన్నారు. 20 వేలు కోట్లు సింగరేణి ఆదాయం ప్రైవేట్ వ్యక్తులు కు వెళ్తుందని, మంత్రి జగదీష్ రెడ్డి నా పేరు చెప్పకుండా కాంట్రాక్ట్ లు అని, చిల్లర గాళ్ళు అని మాట్లాడారంటూ మండిపడ్డారు. కాంట్రాక్ట్ ల కోసం అయితే టీఆర్ఎస్ లోకి వెళ్లే వాళ్ళమని, సింగరేణికి వచ్చే మైన్ ను ప్రైవేట్ వ్యక్తులుకి కట్టబెడుతున్నారన్నారు.
సీమాంధ్ర పెట్టుబడి దారులుకి కాంట్రాక్ట్‌లు, భూములు ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయే ప్రసక్తి లేదని, సింగరేణి టెండర్లు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆయన ఆరోపించారు. నువ్వు మునుగోడు వస్తావా? నేను సూర్యాపేట రావాలా? అంటూ జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ లు నువ్వు చేస్తున్నావ్ అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని, మీ నాటకాలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జగదీశ్ రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నాడని, తెలంగాణరాక ముందు నీ ఆస్తులు ఎంత? ఇపుడు ఎంత? అంటూ వ్యాఖ్యానించారు.
