NTV Telugu Site icon

Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి

Kagajnagar Crime

Kagajnagar Crime

Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం గన్నారంలో గత కొన్ని రోజులుగా పశువులపై దాడి చేస్తున్న పెద్దపులి ఈరోజు ఉదయం ఓ మహిళపై దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెలుతున్న మహిళ పై పులి ఒక్కసారిగా దాడి చేసింది. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. స్థానికులు చూసిన పులి అక్కడి నుంచి పారిపోయింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.

మృతురాలు కాగజ్‌నగర్‌ మండలం గన్నారం చెందిన మార్లే లక్ష్మీగా గుర్తించారు. మృతదేహంతో కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ ఆఫీసు ముందు కుటుంబసభ్యుల ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పులి సంచారంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి పులుల రాక పెరిగింది. పులులు జనావాలసాలకు దగ్గరగా సంచరిస్తున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు.

Read also: Beerla Ilaiah: ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజక్షన్.. వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..

మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దాడి చేసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. పులి రోడ్డు దాటుతూ కనిపించడంతో వాహనదారులు తమ సెల్ ఫోన్లతో పులిని ఫొటోలు తీశారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు దిమ్మదుర్తి సుర్జాపూర్, మస్కాపూర్, ఎక్బాల్‌పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

పెద్దపులి సంచారం నేపథ్యంలో అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు అయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..

Show comments