NTV Telugu Site icon

Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపం.. హరీష్ రావు ఫైర్

Harish Rao

Harish Rao

Harish Rao: గురుకులంలో విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురుకులానికి చెందిన 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారంటూ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని మండిపడ్డారు. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారు? అని ప్రభుత్వాన్ని గురుకుల యాజమాన్యాలను ప్రశ్నించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది అని గుర్తుచేశారు. రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటని తీవ్ర స్థాయిలో హరీష్ రావు మండిపడ్డారు.
Bhatti Vikramarka: నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వివరాలు..

Show comments