Big Scam: ఇందు గలడు అందు లేదు.. ఎందెందు వెతికిన అవినీతి, అక్రమాలు అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి.. కొమురం భీం జిల్లాలో విచిత్ర మాయాజాలం బయట పడింది. సచ్చినోళ్ల పేరు చెప్పి అధికారులు రుణమాఫీ పేరుతో పెద్ద స్కామ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. రైతుల కష్టాలను తీర్చి వాళ్ల కళ్లలో ఆనందం చూడాలని ఒక వైపు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే.. మరోవైపు లేని అప్పులు సృష్టించి ఆ సొమ్మును కూడా మింగేస్తున్నారు కొందరు అవినీతి అధికారులు.
Read Also: KL Rahul Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు కేఎల్ రాహుల్ రిటైర్మెంట్..? ఈ వైరల్ పోస్ట్‌లో నిజమెంత..?
అయితే, పదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి బ్యాంకుకు వచ్చి లోన్లు రెన్యువల్ చేయడం ఎక్కడైనా జరుగుతుందా.. ఇలాంటి చిత్రవిచిత్రాలు చాలా జరిగాయి. కొందరు రైతుల పేర్ల మీద లోన్లు తీసుకుని రుణమాఫీ చేశారు. ఈ విషయంపై కొందరు రైతులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. రెబ్బెన సహకార సంఘంలో అవినీతి అధికారుల చేతివాటంతోనే ఇదంతా జరిగిందని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
