Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారన్నారు. అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా కేసీఆర్ తొందర పాటు నిర్ణయం వల్ల ఛత్తీస్ గడ్ ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పవర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారని మండి పడ్డారు. పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చెయ్యలేదన్నారు.
Read also: V. Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలే మాకు ముఖ్యం..
కేసీఆర్ అనుసరిస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు…ఇప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరమైన అంశాల్లో కేసీఆర్ కొద్ది మందికే లాభం చేకూరే విధంగా నిర్ణయాలు ఉన్నాయన్నారు. టెక్నాలజీ అంశాల్లో ప్రభుత్వానికి నష్టం అని తెలిసి కూడా దాన్నే ఉపయోగించారని తెలిపారు. చట్టాన్ని, రాజ్యాంగ నితిని తుంగలో తొక్కారు. నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరామన్నారు. విచారణ కమిషన్ వేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. రెగ్యులేటరీ కమిషన్ పరిధికి వచ్చే అంశాలు లేవు కాబట్టి ప్రభుత్వం కమీషన్ వేసిందన్నారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ పరిధిలో లేవు కాబట్టి కమిషన్ వేయడానికి ఎలాంటి ఆటంకాలు రాలేదని తెలిపారు.
YS Jagan: రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన…(వీడియో)