Site icon NTV Telugu

Kodanda Reddy : విద్యుత్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే విద్యుత్‌ చార్జీలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి డొమెస్టిక్‌ పైన 40 నుంచి 50 పైసలు ప్రతీ యూనిట్ కు, అలాగే కమర్షియల్ యూనిట్ కు ప్రతీ యూనిట్ వినియోగంపై రూపాయి నుంచి 1.50 పైసల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు విద్యుత్ పై ఆరు డిమాండ్లను ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కిసాన్ మోర్చా నాయకులు కోదండ రెడ్డిలు మాట్లాడుతూ.. పాత టారిఫ్ పద్ధతిలోనే విద్యుత్ బిల్లులు కొనసాగాలన్నారు.
ప్రభుత్వం బకాయి ఉన్న 13 వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఛార్జీలపై చర్చించాలని, విద్యుత్ సంస్థల అంశంపైన ఒక శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

మా ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ సంస్థలకు బకాయిలు లేకుండా చేసామని, విద్యుత్ ఉత్పత్తి పెరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాలు టారిఫ్ తగ్గించాలన్నారు. ఒక నియంత్రణ కమిటీ ఉండాలని, మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా మేము రైతుల పక్షనే మాట్లాడామని వారు వెల్లడించారు. విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, రేగులేటరీ కమిషన్ ప్రతి ఏడాది సమావేశం అవ్వాలని, కమిషన్ ప్రభుత్వంపైన వత్తిడి చేసి వసూలు చేయించాలన్నారు. మీకు అధికారం ఉంది. ప్రభుత్వ బకాయిలు, ప్రైవేట్ బకాయిలు వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలని సూచించారు.

Exit mobile version