NTV Telugu Site icon

Kishan Reddy: జనవరి 22న ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించండి..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: ప్రతి ఇంట్లో జనవరి 22న ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ మన కి బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమాంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2024 మన దేశానికి ముఖ్యమైనటువంటి సంవత్సరం అన్నారు. దేశంలో పార్లమెంట్​ ఎన్నికలు జరగనున్నాయన్నారు. మరోసారి ప్రధాని మోదీ హ్యాట్రిక్​ సాధించబోతున్నారని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని, దేశ ప్రతిష్టను పెంచేలా అనేక చర్యలు చేపడుతూ..పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

Read also: Salaar : వైరల్ అవుతున్న సలార్ డైలాగ్ ప్రోమో.. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేసిందిగా..

రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరగాలని 500 ఏండ్లుగా అనేక మంది పోరాటం చేసి.. చాలా మంది చనిపోయారని తెలిపారు. దేశ ప్రజలతోపాటు ప్రపంచంలోని హిందువులందరూ జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆరోజు ప్రతి హిందువు ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్చువల్​గా శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ప్రతి హిందువు చూడాలన్నారు. ప్రతి ఇంట్లో జనవరి 22న ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. స్వామి వారి మహా హారతిలో పాల్గొని శ్రీరాముడి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నానని అన్నారు.
NTR Mahesh Babu: ఈ ఇద్దరూ ల్యాండ్ అయితే సోషల్ మీడియాకి బ్యాండే