NTV Telugu Site icon

Kishan Reddy.. విమానాశ్రయాల ఏర్పాటుపై కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy Letter To Kcr

Kishan Reddy Letter To Kcr

Kishan Reddy Writes Letter To CM KCR Over Airports Permission: తెలంగాణలో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ అనుసంధానత కోసం అవసరమైన డెవలప్‌మెంట్ చేసివ్వాలని కేంద్రం ప్రభుత్వం కోరుతోందని, అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. సాంకేతిక, భూపరీక్షల ఆమోదాన్ని పొందిన ఆదిలాబాద్, జక్రాన్ పల్లి నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణానికి ముందుకు రావాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. సామాన్యుడికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్’ పథకం తీసుకొచ్చిందని.. దానికి అనుగుణంగా తెలంగాణలోనూ అన్ని రకాల అనుమతులున్న ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.

INDWvsWIW: దీప్తి శర్మ తీన్మార్.. వెస్టిండీస్ 118/6

విమానాశ్రయాల నిర్మాణం అంశాలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేఖలు రాసినా.. కేసీఆర్ నుంచి స్పందన రాలేదని కిషన్ రెడ్డి తెలిపారు. తాను కూడా గతేడాది జులై 30న కేసీఆర్‌కు లేఖ రాశానని, దానికి సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్ పల్లి, పాల్వంచ, దేవకరద్ర, మమ్నూరు, బసంత్ నగర్, ఆదిలాబాద్ విమానాశ్రయాల కోసం ప్రతిపాదనలు పంపిందని.. అయితే AAI చేపట్టిన OLS సర్వే, సాయిల్ టెస్టింగ్, టెక్నో-ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిందని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా.. ఆ పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నలు అడగటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య.. ప్రస్తుతం 140 దాటిందని, 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణలోనూ విమానాశ్రయాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుందని సూచించారు.

Rare ENT Surgery: పూర్తి వినికిడి లోపం చిన్నారులకు అరుదైన ఈఎన్‌టీ ఆపరేషన్

Show comments