Site icon NTV Telugu

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ-బోరుసు లాంటివి.. నీతివంతమైన పాలన తెస్తాం

Kishan Reddy Brs

Kishan Reddy Brs

Kishan Reddy Talks About PM Modi Telangana Tour: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు లాంటివని.. ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒకటేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ ఏనాడూ కాంగ్రెస్‌తో గానీ, బీఆర్ఎస్‌తో గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. కానీ.. గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పని చేశాయని, ప్రభుత్వాన్నీ పంచుకున్నాయని అన్నారు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి.. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సభా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన వరంగల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వస్తున్నారన్నారు.

Pawan Kalyan: వెంటనే క్షమాపణలు చెప్పాలి.. లేదంటే చర్యలు తప్పవ్.. పవన్ భార్య విషయంలో జనసేన లీగల్ సెల్ వార్నింగ్

రూ.6,109 కోట్లు జాతీయ రహదారులకు, రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు మోడీ శంకుస్థాపన చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. తొలి దశలో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల 3వేల మందికి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందుకు తాను ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రేపు ప్రధాని మోడీ మూడు రాష్ట్రాల్లో పర్యటిస్తారని.. మొదట వరంగల్‌కు వస్తారని తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల అనంతరం విజయ సంకల్ప సభ ముఖ్యమైందని.. ఇది రాజకీయంగా ఎంతో కీలకమైన సభ అని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీపై అబద్ధాలు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడుతున్నామో మోడీ వివరిస్తారని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడేలా బీజేపీ కృషి చేస్తోందన్నారు.

Drug Trafficking: అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించిన కిషన్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్‌కు పరిమితం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం కమిషన్‌ల, వాటాల ప్రభుత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. బహుళజాతి కంపెనీలకు భారత్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అన్నారు. అతిపెద్ద ఆర్థికాభివృద్ధి దేశంగా ఐదోస్థానంలో మనం ఉన్నామన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. నిజమైన, నీతివంతమైన పాలనను తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దేశంలో నీతివంతమైన పాలన మోడీ నేతృత్వంలో కొనసాగుతోందన్నారు. మోడీ స్ఫూర్తితో తెలంగాణలో కుటుంబరహిత నీతివంతమైన పాలనను తీసుకొస్తామన్నారు.

Exit mobile version