తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని.. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక కనిపించదని… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు టీ ఆర్ ఎస్ లో చేరారని చురకలు అంటించారు.తనకు మొదటి నుంచి ఒక చెడ్డ లక్షణం ఉంది.. గొంతులో నుంచి మాట్లాడను.. మనసులో నుంచీ మాట్లాడతాననని తెలిపారు. తెలంగాణ రాజకీయ నాయకులు ఏ.ఎస్.ఐ అధ్వర్యంలో కట్టడాలను గుర్తించడం లో వైఫల్యం చెందారని.. మతంతో కట్టడాలకి సంబధం లేదని తెలిపారు. కరోనా కారణంగా బయట దేశాలు నుంచి పర్యాటకులు రావడం లేదని… రామ జన్మ భూమిలో దొరికిన పురావస్తు వస్తువుల్ని మ్యూజియం లో పెడతామన్నారు. జన ఆశీర్వాద యాత్ర అప్పుడే పూర్తి కాదని… బండి సంజయ్ యాత్ర మొదలు అవుతుందని తెలిపారు. తెలంగాణ బీజేపీ పార్టీ అధికారంలో రావాలని చెప్పారు.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది : కిషన్ రెడ్డి
