Site icon NTV Telugu

Kishan Reddy: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టింది.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

Kishan Reddy Hot Comments

Kishan Reddy Hot Comments

Kishan Reddy Sensational Comments On BRS Govt: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని ఆరోపించారు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తూ.. నకిరేకల్ పట్టణంలో ఆగి సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూలమాలవేసి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని మండిపడ్డారు. గ్రామకంఠం భూములతో‌ సహా దళితులకు ఇచ్చిన భూముల్ని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని ఆరోపణలు చేశారు. లిక్కర్ షాపులను ఆరు నెలల ముందే వేలం వేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో నిత్యం బెల్టు షాపులు అందుబాటులో ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Flood Watch: వచ్చేసిన ‘ఫ్లడ్ వాచ్ యాప్’.. ఇక వరద సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చు

కుటుంబ పాలనను తరిమికొట్టి.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ పంపిణీ.. బీజేపీ పోరాట ఫలితమేనని తేల్చి చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయని, వాటి డీఎన్ఏ ఒకటేనని అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే మజ్లిస్ పార్టీ వారి‌ పంచెన చేరి దోపిడి చేస్తోందని ఆరోపించారు. 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణ.. ఈరోజు కల్వకుంట్ల చేతిలో బంధీ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు.

Sajjala Ramakrishna Reddy: అవకాశం ఉన్న అన్నిచోట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైసీపీ పెద్ద పీట వేస్తోంది

Exit mobile version