NTV Telugu Site icon

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల DNA ఒకటే.. రెండూ కలిసి సంసారం చేశాయి

Kishan Reddy Fires

Kishan Reddy Fires

Kishan Reddy Says BRS and Congress Parties DNA Same: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు కలిసి సంసారం చేశాయని ఎంపీ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేశాయని.. అధికారమూ పంచుకున్నాయని అన్నారు. కుటుంబ రాజకీయాలు, అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఆ రెండూ కుటుంబ పార్టీలేనన్న ఆయన.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ రెండూ కలిసి పని చేశాయని చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే, అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ వల్లే అత్యంత ప్రమాదకరమని గతంలో వాజ్‌పేయు చెప్పారని గుర్తు చేశారు.

Kajal Aggarwal: నా భర్త అంటే మా నాన్నకు ఇష్టం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్

కులాలు, భాషలు, మతాల పేరుతో పబ్బం గడుపుకునే పార్టీ కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి కుర్చీని నిలుపుకోవడం కోసం.. ప్రజాస్వామ్యాన్ని మంటకలిపిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. కుటుంబాలకు అధికారం కట్టబెట్టడం కోసం పాకులాడే పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. తాము బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌గా ఎప్పుడూ ఉండమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఘోరవైఫల్యం చెందారని అన్నారు. ఈ నెల 8న వరంగల్‌లో పలు అభివృధ్ది కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని వెల్లడించారు. రోజుకు మూడు వ్యాగన్లు చొప్పున ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ఉత్పత్తి కేంద్రానికి ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారన్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారన్నారు.

Koppula Eshwar: రేవంత్, ఇదీ మీ సంస్కారం.. మంత్రి ఈశ్వర్ కౌంటర్ ఎటాక్

బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో, బీఆర్ఎస్‌కు కూడా అంతే దూరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధాంతపరంగా రెండు పార్టీలు తూర్పు, పడమరగా ఉన్నాయని చెప్పారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతో ‘బీ-టీమ్’ అంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినట్టే.. రేపు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ ఊహాలోకంలో విహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని రాహుల్ వ్యాఖ్యానించారని.. అది తేల్చాల్సింది తెలంగాణ ప్రజలని, అసమర్థుడైన రాహుల్ కాదంటూ విరుచుకుపడ్డారు.