BJP Bike Rally: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నేడు ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామ వరకు బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాల పుస్తకాల్లో విమోచన పోరాటాన్ని పొందుపరచాలని, సైనికులు మరణించిన స్థలాలను స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ, తార్నాక, ఉప్పల్, భైరోన్‌పల్లి, ఖిలాషాపూర్, పరకాల మీదుగా బైక్ ర్యాలీ సాగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పరకాల వరకు బైక్ ర్యాలీ. సాయంత్రం జరిగే బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ సందర్భంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు నిర్వహించింది
Read also: Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు
పెరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17 న బహిరంగ సభ.. ముగ్గురు సీఎం లకు ఆహ్వానం… సెప్టెంబర్ 17 విశ్వకర్మ పథకం వరంగల్ లో లాంచింగ్.. అనంతరం అధికారిక కార్యక్రమం తో పాటు, బీజేపీ బహిరంగ సభ రెండు వేర్వేరు.. రెండు కార్యక్రమాలు పెరేడ్ గ్రౌండ్ లోనే.. 9 గంటలకు అధికారిక కార్యక్రమం.. 11 గంటలకు బహిరంగ సభ.. సెప్టెంబర్ 20 నుండి 23 వరకు 450 మందిని సెలక్ట్ చేసి… మండలాల వారీగా పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఎగురవేసి, పారా మిలటరీ బలగాల కవాతులో గౌరవ వందనం స్వీకరించి, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో వరుసగా రెండో సంవత్సరం కూడా పాల్గొంటారు. అన్ని పోలింగ్ బూత్‌లు, పార్టీ కార్యాలయాల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అదే రోజున, పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా, మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో రక్తదానం మరియు ఆరోగ్య శిబిరాలతో కూడిన హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తుంది.
AP CM Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
