NTV Telugu Site icon

Kishan Reddy: సూట్ కేసు నిండా డబ్బులు.. లారీల కొద్దీ బీర్లు

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: ధర్మానికి, న్యాయానికి,అన్యాయానికి,అక్రమాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలె మునుగోడు ఉప ఎన్నికలు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మునుగోడుల్లో టీఆర్ఎస్ కోట్లు కుమ్మరించినా, వారి బలం పెరగడం లేదన్నారు. అయితే..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ కుటుంబం సూట్ కేసుల నిండా డబ్బులు, లారీల నిండా మద్యం, చికెన్, బిర్యానీ పొట్లాలతో వస్తున్నారని ఆరోపించారు. మునుగోడుకు అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తూ, మునుగోడులో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రత్తిపల్లి, గంగోని గూడెం గ్రామాల్లో పర్యటించారు.

Read also: Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు

అయితే.. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ 8 ఏళ్లలో రూ. 5లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక, ఇప్పుడే పుట్టిన పసిబిడ్డతో పాటు.. ప్రజల నెత్తిమీద కేసీఆర్ లక్ష రూపాయల అప్పు పెట్టాడని ఆరోపించారు. దీంతో.. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గ్రామాల్లోని అంగన్వాడీ వర్కర్లు, పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో అడుగడుగునా వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఓపెన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్ప పథకాల పేరు మీద డబ్బులు చేతిలో పెట్టి, మరో చేతితో మద్యం విక్రయిస్తూ, ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటోందన్నారు. ఇక.. మద్యం సేవించడం వల్లే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కుటుంబాలు ఆగమవుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు.
Bigg boss 6: ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!