NTV Telugu Site icon

Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ ఒక్కటేనా?

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy Fires On TRS Government: అభివృద్ధి అంటే కేవలం హైటైక్ సిటీ ఒక్కటేనా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ఆయన.. అభివృద్ధి అంటే రాష్ట్ర ప్రభుత్వం హైటైక్ సిటీ వైపు చూస్తోందని.. కానీ ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్‌తో పాటు పలు డివిజన్లలోని ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. బస్తీల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని.. రోడ్లు సరిగా లేక మురుగునీరు పారుతూ జనం అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. అయినా.. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం హైటెక్ సిటీ మీదే దృష్టి పెట్టిందని ఆగ్రహించారు. తన పాదయాత్రలో భాగంగా డివిజన్లలోని ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆయన.. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు.

Kapu Reservations: ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అంతకుముందు హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్, మల్లేపల్లి డివిజన్లలో పాదయాత్ర చేసిన కిషన్ రెడ్డి.. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. డివిజన్‌లో స్ట్రీట్ లైట్లు లేకపోవడం, రోడ్లలో గుంతలు ఉండటం మీద అధికారులపై ఫైర్ అయ్యారు. ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బస్తీలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని.. వీధిలైట్లకు నిధులు కేటాయించని పరిస్థితి నెలకొందని అన్నారు.

Omicron BF.7: చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం.. భారత్‌లోకి ప్రవేశం