NTV Telugu Site icon

Kishan Reddy: రాజాసింగ్‌ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు తెలీదు

Kishan Reddy On Raja Singh

Kishan Reddy On Raja Singh

Kishan Reddy Fires On Bandi Sanjay Arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రను అడ్డుకోవడాన్ని కేంద్రమంత్రి కిషణ్ రెడ్డి వ్యతిరేకించారు. సంజయ్‌ని అరెస్ట్ చేయడం చేతకాని తనమని విమర్శించారు. కుట్ర పన్ని మరీ ఆయన యాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీస్‌లు దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించకూడదని.. టీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబమే శాశ్వతంగా ఉంటుందని పోలీస్ అధికారులు అనుకుంటున్నారని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం శాస్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలని పోలీసులకు హితవు పలికారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్‌లను బ్రష్టు పట్టించారని.. పోలీస్‌లు ఫోన్‌లో మాట్లాడాలంటేనే భయపడుతున్నారని అన్నారు. కేంద్రమంత్రులు ఫోన్ చేసినా.. అధికారులు ఫోన్‌లు ఎత్తరని ఆరోపించారు.

టీఆర్ఎస్‌లో ఉన్న మెజారిటీ నేతలు ఆ పార్టీలో మనస్ఫూర్తిగా లేరని, కేవలం అవసరాలు తీర్చుకోవడం కోసమే ఉన్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మునుగోడులో నిర్వహించిన అమిత్ షా సభతో తన సభను కేసీఆర్ పోల్చుకున్నారన్నారు. బీజేపీకి ఎక్కువ జనం రావడం, వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ భయపడుతున్నారని.. అందుకే బీజేపీని అడ్డుకునేందుకు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అర చేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి.. అలాగే తెలంగాణలో కమల వికాసాన్ని ఎవ్వరూ ఆపలేరని కిషన్ రెడ్డి వెల్లడించారు. దళిత బందు ఇవ్వనందుకు, దళుతుడ్ని సీఎం చేస్తానని చెప్పి చేయనందుకు.. ఆ కూర్చికీ దండం పెట్టి ఓటు వేయాలన్నారు. అలాగే.. మూడు ఎకరాల భూమి ఇవ్వనందుకు, భూమికి దండం పెట్టి ఓటు వేయాలని కిషన్ రెడ్డి ప్రజల్ని కోరారు.

ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రాజాసింగ్ వ్యవహారంపై తనకు ఏమాత్రం అవగాహన లేదని కిషన్ రెడ్డి చేతులు ఎత్తేశారు. ఆయన ఏం మాట్లాడారో తనకు తెలియని.. రాజా సింగ్ సస్పెన్షన్ వ్యవహారంపై స్పష్టత లేదని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు బీజేపీ గురించి మంచిగా మాట్లాడరని చెప్పారు. కవిత విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఆ విషయంపై ఇప్పుడే కామెంట్ చేయడం సరికాదని అన్నారు.