Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యిందన్నారు. ఈటెల రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారని తెలిపారు. ఎవరు ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నామన్నారు. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోడీలో ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవాలన్నారు. తెలంగాణలో 12కు పైగా స్థానాలను గెలుస్తున్నామని తెలిపారు. బీజేపీకు బీఆర్ఎస్ బీటీం అంటున్నారు.. మేము ఎవరికి బీటీం కాదన్నారు.
Read also: Maoists: రాళ్లు, బ్యానర్ పోస్టర్లు వేసి రోడ్డును దిగ్బంధించిన మావోలు..
తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అనేది లేదు.. వాళ్లకి ఒక్క సీట్ రాకపోయిన ఏం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదన్నారు. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. దీన్ని ఎవరు ఆపలేరన్నారు. ఐక్యమత్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. మల్కాజ్ గిరిలో ఈటెలను గెలిపిద్దామన్నారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్టానం చెప్పిందన్నారు. నామినేషన్ తరువాత అందరూ డోర్ టూ డోర్ ప్రచారం చేయాలన్నారు. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నాం అనేది వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మనకు ఢోకా లేదన్నారు.
Read also: Eagle : నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన ఈగల్ తమిళ్ వెర్షన్..
రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదన్నారు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో కూడా అర్థం కావడం లేదన్నారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో వంశీ తిలక్ ను గెలిపించాలన్నారు. అనేక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించాడు వంశీ అని తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికలు కూడా మనకు కీలకం.. అసెంబ్లీ సీటును కూడా గెలవాలన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది.. ఈటెల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవడానికి.. లోక్ సభ ఎన్నికలు మొదటి అడుగన్నారు.
Loksabha Election 2024: ఎన్నికల ప్రచారంలో గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!
