NTV Telugu Site icon

Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా లేదా…..సీబీఐ విచారణ కు లేఖ రాస్తారా లేదా? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తె కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి ప్రాజెక్ట్ ల మీద విచారణ జరుపుతామని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని 15 ఈఫిల్ టవర్ లకు వాడినంత ఉక్కు, 7 బుర్జు ఖలీఫా లకు వాదినంట కాంక్రీట్ వాడామని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. డిస్కవరీ ఛానల్ లో ప్రచారం చేసుకున్నారు… గిన్నిస్ రికార్డ్ అన్నారని తెలిపారు. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి? లక్ష కోట్ల ఖర్చు పరిస్థితి ఏంటన్నారు. ఎన్నికలకి ముందు ఇప్పటి సీఎం మాట్లాడింది ఏంటి ఆలోచించాలన్నారు. రీ ఇంజనీరింగ్ రివర్స్ ఇంజనీరింగ్ అయిందన్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ ఇమేజ్ ను గోదావరిలో కలిపేశారని అన్నారు. మేడి గడ్డ కుంగిన ఘటనపై వెంటనే కేంద్రానికి పిర్యాదు చేసామన్నారు. కేంద్రం డ్యాంసేఫ్టీ అథారిటీ విజీట్ చేసిందన్నారు. అధికారులతో సమీక్ష చేసిందని అన్నారు. మరిన్ని వివరాలు కావాలని లిఖిత పూర్వకంగా అడిగిందని తెలిపారు. ఇప్పటివరకు వివరాలు ఇవ్వక పోవడం దురదృష్టం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: MLA MS Babu: సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. మీరు చెప్పిందే చేశా.. నా తప్పంటే ఎలా?

20 అంశాల్లో కేవలం 11 వాటికి అరకొర రిప్లై ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి అద్దం పట్టేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. విచారణ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఊచలు లెక్కపెడుతుందన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మోడీ ఏమీ చేస్తున్నారని, కేంద్రం ఏమీ చేస్తుంది, కిషన్ రెడ్డి ఏమీ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి పదే పడే అడిగారు.. కాళేశ్వరం పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా…దోషులకు శిక్ష పడాలని అనుకుంటున్నారా లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ , అవినీతితో కలిసి కాపురం చేసిందన్నారు. ప్రజాధనాన్ని కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ప్రజా ధనాన్ని దోపిడీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏ ఒక్కటే అన్నారు. మనం వేర్వేరు కాదు అన్నటుగా ఆ రెండు పార్టీ లు తోడు దొంగలాట ఆడుతున్నారు…అందుకే మెతక వైఖరి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు కదా.. ఎప్పుడు సీబీఐ విచారణ ఎందుకు అడిగారు? అని ప్రశ్నించారు.

Read also: Ram Charan: ఆ శంకర్ తో ఇలా ఇరుక్కుపోయావ్ ఏంటి అన్న… ఇండియన్ 2 అయిపోయి 3 అంటున్నాడు?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అత్యంత పెద్ద అవినీతి కాళేశ్వరం అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మీకు చిత్త శుద్ది ఉందా లేదా…..సీబీఐ విచారణ కు లేఖ రాస్తారా లేదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వం వహించి ఏదైనా అంగీకారం కుదిర్చిందా? కేసీఆర్ పీడ విరగడ కావాలని ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారని అన్నారు. కేసీఆర్ కు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మితే ఊడి పోయే ప్రభుత్వం అని కేసీఆర్ తో ఏదైనా ఒప్పందానికి వచ్చారా? అనే ది ప్రజలకు తెలవాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదనుకుంటే దమ్ముంటే సీబీఐ విచారణ కు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆదేశిస్తే 48 గంటల్లో సీబీఐ విచారణ ప్రారంభిస్తుందననారు. ఇళ్ళలక గానే పండుగ కాదు… ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. ఎన్నికలకి ముందు సీబీఐ ఎంక్వైరీ అన్నారు… ఇప్పుడు జ్యుడిషరీ ఎంక్వైరీ ఎందుకు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

Show comments