NTV Telugu Site icon

Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులను మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని దగా చేసిందన్నారు. కౌలు రైతులకు 15 వేలు ఇస్తామని చెప్పారు… వరికి క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తామని చెప్పి యే ఒకటి కూడా అమలు చేసేలా లేదన్నారు. రైతులను నయవంచన చేసి అధికారం లోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. దేవుడి పేరుతో ఓట్లు పెడుతూ ప్రజలకి మాత్రం పంగనామాలు పెడుతుంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతుందన్నారు.
చెయ్యి గుర్తుకు ఓటు వేసినందుకు రైతులకు చేయి ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు బియ్యం కొనడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బోనస్ ఇచ్చి కొనడంలో మీకు వచ్చిన బాధ ఏంటి? అని ప్రశ్నించారు.

Read also: Bhadradri Kothagudem: విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి..

తెలంగాణలో ఎంత ధాన్యం పండిన యే రకం అయినా కేంద్రం కొంటుంది… రైతులకు అండగా కేంద్రం ఉంటుంది… డబ్బులు చెల్లిస్తుందన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది .. దుర్మార్గం అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకు 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఖరీఫ్ సీజన్ ది రాష్ర్ట ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదన్నారు. రబీలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఒప్పందం చేసుకుంటే 33 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించింది ఈ ప్రభుత్వం అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం మొలకెత్తిన … కొనుగోలు మాత్రం నామ మాత్రంగా నత్తనడకన నడుస్తుంది…రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కోనుగులు చేసింది 75 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే అన్నారు. సోనియమ్మ రాజ్యం అంటే రైతుల కన్నీళ్లు చూడడమా? అని మండిపడ్డారు.

Read also: CM Revanth Reddy: తిరుమలలో కల్యాణ మండపం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ధాన్యం FCI కి చేరే వరకు అయ్యే ఖర్చు మొత్తం భరుస్తుంది… రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క పైసా కూడా భారం కూడా పడదు… ఇంకా కమిషన్ ఇస్తుంది కేంద్రం… కమిషన్ డబ్బులతో నే ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. దొడ్డు రకం వేస్తే అడ్డుకుంటామని సీఎం అంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఎందుకు బోనస్ చెల్లించడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. మీ గారెంటీలు గారడీలు కాకుంటే తెలంగాణ ఓట్ల మీద మీకు గౌరవం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఇప్పుడు కళ్ళాలలో ఉన్న దాన్యం కు బోనస్ చెల్లించి కోనాల్సిందే అని డిమాండ్ చేశారు. ధాన్యం మీద కనీస ధర 61 శాతం కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. సన్న బియ్యం కి వెయ్యి బోనస్ ఇవ్వాలన్నారు. మిగతా ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read also: పురుషులకు గర్భ నిరోధక ఇంజక్షన్.. నిజమేనా..

ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం వెయ్యి రూపాయల బోనస్ ఇస్తుందన్నారు. రుణమాఫి చేయని కారణంగా రైతులు కొత్తగా రుణం తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు రైతులు అప్పులు ఎక్కడ తెచ్చుకోవాలి… రైతు బతుకు ఏంది? అని ప్రశ్నించారు. ఆగస్టు లో రుణమాఫీ చేస్తారనే నమ్మకం లేదన్నారు. ఆగస్టు వరకు వర్షాలు పడకుండా రేవంత్ రెడ్డి ఏమైనా ఆపుతారా? అని వ్యంగాస్త్ర వేశారు. 6 గ్యారంటీల పై సోనియమ్మ సంతకంతో ఇంటింటికి లెటర్ రాసింది కాంగ్రెస్ అన్నారు. భారత దేశాన్ని మోసం చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ అని తెలిపారు. కాంగ్రెస్ ఆలోచన గుంట నక్క కన్నా ఎక్కువగా ఉంటుందన్నారు.

Read also: Second Hand Phone: సెకెండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త..

ఎన్ని తరాలు మారినా కాంగ్రెస్ తీరు మారదన్నారు. 15 వందల తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీ నీ జూన్ 2 న ఆవిర్భావ దినోత్సవం కు పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి సోనియా గాంధీ ఎలా వస్తారు? అని మండిపడ్డారు. తెలంగాణను ప్రజలు దంచి తెచ్చుకున్నారు… సోనియా ఇవ్వలేదన్నారు. సోనియా వారసత్వ రాజకీయాలకు నాయకురాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల పోరాటం చేసి… సుష్మ స్వరాజ్ పోరాటం తో తెలంగాణ వచ్చిందన్నారు. మార్కెట్ యార్డు లు విజిట్ చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు.
KTR: నేడు ఉమ్మడి వరంగల్ లో కేటీఆర్ పర్యటన..