Site icon NTV Telugu

Kishan Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌ రెడ్డి

Kisahnreddy

Kisahnreddy

Kishan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే బీజేపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే… వ్యూహాలు రచించి ప్రజల్లోకి వెళుతున్నారు. దీంతో పాటు ఢిల్లీకి చెందిన అనుభవజ్ఞులు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని పునరుద్ఘాటిస్తూ.. ఆ వర్గాన్ని కమలం పార్టీ ఆకర్షిస్తోంది. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా అభ్యర్థులను మందలించింది. కానీ… పార్టీలో కొందరు ప్రముఖ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గైర్హాజరుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పోటీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీసీలను ముఖ్యమంత్రి చేయడమే తమ పార్టీ విధానమని కిషన్ రెడ్డి అన్నారు.

Read also: Supreme Court: గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి.. బిల్లులను పెండింగ్‌లో ఉంచలేరు: సుప్రీం కోర్టు

ఈ నేపథ్యంలో తాను ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకు, శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. అయితే తాను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని కిషన్ రెడ్డి అన్నారు. 2009, 2014లో అంబర్‌పేట ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్‌రెడ్డి 2018లో కాలేరు వెంకటేశంపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తాజాగా పార్టీ అధిష్టానం ఆయనను మరోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. అయితే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని గెలిస్తే.. సీనియారిటీ ప్రకారం కిషన్ రెడ్డి సీఎం అభ్యర్థి అని అందరూ భావించారు. అయితే ఈసారి బీజేపీ గెలిస్తే బీసీనే సీఎం అని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో.. ఎలాగూ సీఎం అయ్యే అవకాశం లేకపోవడంతో కిషన్ రెడ్డి బరిలో నిలవకుండా పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Rajasthan: రాజస్థాన్ లో రేపే పోలింగ్

Exit mobile version