Site icon NTV Telugu

Kishan Reddy : ఏ దేశానికి మనం తక్కువ కాదు, గొప్ప వారసత్వం మనది

ఎంతో మంది కళాకారులు నైపుణ్యంతో వస్తువులు తయారు చేస్తున్నారని, కళాకారులకు ప్రోత్సాహం అవసరమని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రజలు హస్త కళలను ప్రోత్సహించాలని, మార్చి 6వ తేదీ వరకు హునర్ హాట్ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. మేకిన్ ఇండియా మేడిన్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. ఏ దేశానికి మనం తక్కువ కాదు, గొప్ప వారసత్వం మనదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసి వస్తువులు కొంటారు.

కానీ మన దేశంలో కూడా అన్ని రకాల వస్తువులు తయారు చేసే వాళ్ళు ఉన్నారని ఆయన అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ.. తెలంగాణలో 200 మైనార్టీ స్కూల్స్ కు ఆర్థిక సహాయం చేశామని ఆయన తెలిపారు. మైనార్టీ పాఠశాలలకు ప్రధాని మోదీ నిధులు కేటాయించారని, హిజాబ్ పై ఇండియాలో బ్యాన్ లేదు. ప్రస్తుతం హిజాబ్ అంశం కోర్టులో ఉందని ఆయన అన్నారు. స్కూల్స్ కు, ఎడ్యుకేషన్ ఇన్ట్సిట్యూట్ లకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంటుందని ఆయన అన్నారు.

https://ntvtelugu.com/balka-suman-made-comments-on-revanth-reddy/
Exit mobile version