Hyderabad: హోం వర్క్ చేయలేదని టీచర్ తలపై స్లేట్ తో కొట్టడంతో తీవ్ర గాయమై ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. హేమంత్ (5) హైదరాబాద్ రామంతాపూర్ వివేకనగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన హేమంత్ హోంవర్క్ చేయలేదని తలపై బోర్డుతో కొట్టింది. దీంతో ఆ చిన్నారి బాలుడు ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. భయభ్రాంతులైన యాజమాన్యం వెంటనే
ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడు అస్వస్థత స్థితిలో ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. యాజమాన్యం అసలు విషయం చెప్పడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు టీచర్లపై నమ్మకంతో పాఠశాలకు పిల్లలను పంపిస్తే చంపేస్తారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి టీచర్లను కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లే హత్య చేశారంటూ తల్లిదండ్రులు, బంధువులు, కాలనీ వాసులు బాలుడి మృతదేహంతో పాఠశాల ఎదుట బైఠాయించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని వనపర్తికి తరలించారు.
Read also: Astrology: అక్టోబర్ 03, మంగళవారం దినఫలాలు
మరోవైపు నవీపేట్ మండల కేంద్రానికి చెందిన గూడూరు రాజశేఖర్ తన కూతురు రుషిత(4)తో కలిసి సోమవారం ఉదయం స్థానిక ఎన్ మార్ట్ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. రాజశేఖర్ మాల్‌లో వస్తువులు కొంటుండగా, రిషిత చాక్లెట్లు తెచ్చుకునేందుకు ఫ్రిజ్ డోర్ తెరవడానికి వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారికి విద్యుత్ షాక్ తగిలింది. షాపింగ్‌లో బిజీగా ఉన్న తండ్రి ఈ విషయాన్ని గమనించకపోవడంతో చిన్నారి కొన్ని సెకన్ల పాటు ఫ్రిజ్‌పై వేలాడదీశాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారిని గమనించిన తండ్రి రాజశేఖర్ వెంటనే చిన్నారిని ఎత్తుకుని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫ్రిజ్‌లో సాంకేతిక లోపం తలెత్తినా మాల్ యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో.. ఫ్రిజ్‌కు విద్యుత్ సరఫరా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
