NTV Telugu Site icon

Kidnapping: చాకెట్లు కొనిస్తానని కిడ్నాప్‌.. చాకచక్యంగా బయటపడ్డ చిన్నారులు

Kidnaping

Kidnaping

Kidnapping: కరీంనగర్ జిల్లా లో ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌ కలకలం రేపింది. కొత్తకొండ నుండి కరీంనగర్‌లో నానమ్మ చనిపోతే ఓకుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు అక్షిత, లోకేష్. అయితే ఈ ఇద్దరి పిల్లలపై జయశ్రీ అనే వృద్ధురాలు కన్నుపడింది. ఆచిన్నారులను ఎలాగైనా సరే కిడ్నాప్‌ చేయాలని పన్నాగం వేసింది. ఆఇద్దరి పిల్లలకు మంచి మాటలు చెప్పి బాగా దగ్గరైంది. ఆ చిన్నారులు కూడా ఆ వృద్ధురాలిని నమ్మి ఆచిన్నారి తల్లిదండ్రులు కూడా ఆమె వద్దనే వదిలేసారు. బాగా ఆడుకుంటూ ఆవృద్ధురాలితో ఆడుకుంటుంటే ఆమెను నమ్మారు. అయితే జయశ్రీ అనే వృధ్దురాలు ఆమె తెలివి ఉపయోగించి మెల్లగా పిల్లలను కిడ్నాప్‌ చేయాలని ఇదే సరైన సమయమని భావించి వాకిరి సాపింగ్‌ చేద్దామని, మీకు చాక్లెట్లు కొనిస్తానంటూ నమ్మించింది. ఆపిల్లలు చాక్లెట్లు అంటూనే ఆశగా ఆ వృధ్దురాలు వెంట వెళ్లారు.

Read also: Chain Snatching: ఓరేయ్‌ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు

జయశ్రీ కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఇద్దరు పిల్లలతో రైలెక్కి ఔరంగబాద్ తీసుకెళ్లింది. చిన్నారులకు ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అని ప్రశ్నించినా జవాబు ఇవ్వలేదు. వారిద్దరిని రైల్ లోపలికి తోసేంది. చిన్నారులు ఇద్దరు భాయాందోళనకు గురయ్యారు. మమ్మల్ని వదిలేయ్‌ మేము వెల్లిపోతాం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఆ ఇద్దరు చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసింది. కడుపుపై దారునంగా కొట్టింది. అరవద్దంటూ లేదంటే రైలు నుంచి కిందికి తోసేస్తానంటూ భయపెట్టింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారు ఏడుస్తూనే ఏమీ చేయలేకపోయారు. ఇక ఈ ఇద్దరు చిన్నారులను అమ్మేందుకు జయశ్రీ వృధ్దురాలు వేరే వారికి ఫోన్‌ చేసి ఐదువేలకు అమ్మేస్తానంటూ మాట్లాడటం ఈ ఇద్దరు చిన్నారులను కలవరపాటుకు గురిచేసింది. ఇద్దరు చిన్నారులు అక్షి, లోకేష్ వద్ద ఫోన్‌ వుండటంతో పోలీసులకు ఫోన్‌ చేశాడు. ఇంతలోనే జాల్నా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై పిల్లలను కొడుతున్న జయ శ్రీ ను చూసి అనుమానంతో అనుమానం తో పిల్లలను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.

Read also: Telangana Assembly: గవర్నర్ బడ్జెట్ ప్రసంగం.. నేడు ధన్యవాద తీర్మానం

ఇద్దరు పిల్లలు మా అదుపులోనే ఉన్నారని మహారాష్ట్ర పోలీసుల నుంచి పిల్లల కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సార్‌ మా పిల్లలను మావద్దకు చేర్చండి సార్‌ అంటూ ప్రాధేయపడ్డారు. పిల్లలను పోలీసులు కరీంనగర్‌ పోలీస్టేషన్‌కు సేఫ్‌ గా చేర్చారు. అక్కడే వున్న తల్లిదండ్రులు పిల్లలను చూసి గట్టిగా పట్టుకుని కన్నీరుపెట్టుకున్నారు. కరీంనగర్ చేరుకున్న ఇద్దరు పిల్లలు సంతోషం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ధన్యావాదాలు తెలిపారు. పోలీసుల వల్లే మా పిల్లలు మావద్దకు వచ్చారని లేదంటే వారిని కోల్పోవాల్సి వచ్చేది అంటూ పోలీసులకు పాదాభివందనం సార్‌ అంటూ.. ఓతల్లి కడుపుకోతను పోలీసులు అర్థం చేసుకుని చిన్నారులను సేఫ్‌ గా మా వద్దకు చేర్చారని సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్‌ పోలీసులకు సెల్యూట్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రెండు రోజులు ముందు కరీంనగర్ లో కలకలం రేపిన ఈఘటన ఇవాల ఆచిన్నారులు తల్లిదండ్రుల వద్ద చేరడంతో సుఖాంతమైంది.

Show comments