Lover Kidnap: ఘట్కేసర్ లో కిడ్నాప్ కలకలం.. చెల్లిని ప్రేమించాడని యువకుడిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Kidnap: హైదరాబాద్ ఘట్కేసర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. చెల్లిని ప్రేమించాడని ఓ అన్న ప్రేమికుడిని కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది. ప్రేమికుడు ఉదయ్ రాజ్ ను తన చెల్లెకి దూరంగా ఉండాలని తనుష్ బెదిరించాడు. అయితే తనుష్ బెదిరింపులను ఉదయ్ పట్టించుకోలేదు. చెల్లెలితో అప్పటికే పీకల్లోతు ప్రేమలో వున్న ఉదయ్ ఆమెకు తన అన్న విషయం చెప్పాడు. వీరిద్దరూ తనుష్ మాటలను పెడచెవిన పెట్టడంతో అన్న (తనుష్) కోపంతో ఊగిపోయాడు. ఉదయ్ ను కిడ్నాప్ చేయాలని తనుష్ స్నేహితులతో కలిసి ప్లాన్ వేసాడు. దీంతో శనివారం అర్ధరాత్రి ఉదయ్ రాజ్ ను కిడ్నాప్ కు ప్లాన్ వేశారు. సంసృతి టౌన్ షిప్ లో ఉదయ్ ను కిడ్నాప్ చేసేందుకు తనుష్, తన స్నేహితులు కాపుకాచారు. వాళ్లను గమనించని ఉదయ్ సంసృతి టౌన్ షిప్ కు ఎంట్రీ కాగానే.. తనుష్, తన స్నేహితులు రౌండప్ చేశారు. ఉదయ్ వాళ్లను ఎవరు మీరు అనే లోపే అతన్ని కిడ్నాప్ చేశారు. టౌన్ షిప్ నుంచి మల్కాజ్ గిరికి తరలించారు.
Read also: Andhra Pradesh: సమ్మెకు సిద్ధమవుతోన్న ఉద్యోగులు..! నేడు మంత్రుల బృందం చర్చలు
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
అక్కడే ఆదివారం ఉదయం వరకు ఉంచి ఉదయ్ ను చిత్రహింసలకు గురిచేశారు. తన చెల్లిని వదిలేయాలని లేదంటే ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నామని తనుష్ బెదిరించాడు. దీంతో భయాందోళన చెందిన ఉదయ్ వారి ముందు ఏమీ మాట్లాడలేకపోయాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఉదయ్ ను చిత్రహింసలకు గురిచేసి ఏమీ తెలియనట్లు ఆదివారం తెల్లవారుజామున ఉదయరాజ్ ను తార్నాక వద్ద తనుష్ గ్యాంగ్ విడిచి వెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న ఉదయ్ తన కిడ్నాప్ ఘటన పై పోచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. తనకు శనివారం అర్ధరాత్రి కిడ్నాప్ చేసి ఆదివారం ఉదయం వరకు చిత్రహింసలకు గురిచేసారని వాపోయాడు. తన చెల్లిని ప్రేమించాడనే కోపంతోనే తనుష్ తనపై ఇలా చేశాడని కేసులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసారు. తనుష్ ను తనకు సహకరించిన స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే తనుష్ ను పట్టుకుని విచారిస్తామని తెలిపారు. ఉదయ్ ను తన బంధువుల వద్దకు చేర్చారు.
Airtel Recharge Paln 2024: అపరిమిత 5జీ డేటా.. ఎయిర్టెల్ బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్ ఇవే!
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!