Tummala Nageswara Rao: అన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు జాగ్రత్తగా ఉండాలని, రైతులను అందరూ మోసం చేస్తుంటారని మంత్రి సూచించారు. తెలంగాణలో అధిక వర్షాల వల్ల ఇబ్బందుల్లో రైతులు వున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాపితంగా అన్ని చోట్ల సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. మద్దతు ధర కంటే ఎక్కువగా కొనుగోళ్లు చేసేలా చూడాలని అన్నారు. రైతులు హార్టికల్చర్ వైపు మళ్ళితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఎక్కువగా ఆదాయం వచ్చే వాటికి రైతులు మళ్లాలని తెలిపారు. అన్ని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందన్నారు. కష్టమైన నష్టమైనా ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
Read also: CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినా దిగుబడి తగ్గడమే కారణం. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయనున్నారు. అలాగే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మార్కెటింగ్‌శాఖ అధికారులకు సూచించారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే.. మంత్రి తుమ్మల కూడా రైతులకు కొన్ని సూచనలు చేశారు. సంప్రదాయ పంటల నుంచి ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలన్నారు. పత్తి, మిరియాలకు బదులు పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని మంత్రి తెలిపారు. మరోవైపు కొత్త కాలనీలు, విలీన గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వరంగల్ ఎనుమాము మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ.7,521గా ఉంది. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎనుమాముల మార్కెట్‌కు వచ్చిన ప్రతి బస్తా పత్తిని కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్