Tummala Nageswara Rao: విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, చిత్తశుద్ధితో పనిచేస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. నేలకొండపల్లిలో రాజకీయంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రతినిధిగా రెండు, మూడు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేశానని అన్నారు. రామదాసు జీవిత చరిత్ర కోసం నాలుగు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. నేలకొండపల్లిలో డిగ్రీ, ఇంటర్ భవనాలకు ఏర్పాటు చేశామని, ప్రజల కోరిక మేరకు జాతీయ రహదారిని ఊరు బయటనుంచి రూట్ మార్చానని అన్నారు.
Read Also: Emperor Vikramaditya : ప్రధాని పిలుపు మేరకు నాటక ప్రదర్శన.. అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం
ప్రతీగ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించామని.. పాత కాలువ 70 కోట్లతో పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ శాతం నీటి పారుదల కలిగిన నియోజకవర్గంగా పాలేరు నిలిచిందని అన్నారు. పెదరికాన్ని పారద్రోలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. ఇంకో నాలుగేళ్ల తరువాత పాలేరు నియోజకవర్గం లాంటి నియోజకవర్గం మరోకటి ఉండదని అన్నారు. సీతారామ పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరుకు తీసుకొస్తామని అన్నారు. ఆనాడు ఇచ్చిన మాట కోసం పెద్ద పాలేరుగా పనిచేశానని, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పాలేరును తీర్చిదిద్దానని అన్నారు. మళ్లీ అవకాశం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.