Mallu Bhatti Vikramarka: మధిర చుట్టూ రింగ్ రోడ్ల ను ఏర్పాటుచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో 25 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకి సరిహద్దుగా ఉన్న మధిర పట్టణం ఇండస్ట్రియల్ పార్కు ద్వారా ఇంకా నగర స్థాయిలోకి అభివృద్ధి చేస్తామన్నారు. ఇటు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులకి జంక్షన్ గా మదిర కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మదిరని పెద్ద నగరంగా తయారు చేయడానికి కృషి చేస్తామన్నారు. మధిర చుట్టూ రింగ్ రోడ్ల ను ఏర్పాటుచేసి నగరాన్ని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనికోసం ఒక కార్యచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యా వైద్య పరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని తెలిపారు.
Read also: Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రాన్ని కూడా మధిరలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కొల్డ్ స్టోరీ నిర్మాణం చేపడతామన్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిని సారించాలని అధికారులను కోరుతున్నామన్నారు. స్వశక్తిగా వ్యాపారం చేసుకునేందుకు 84 ఎకరాల్లో 45 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం ఏర్పటు చేస్తున్నట్లు వెల్లడించారు. మధిర నియోజకవర్గం వ్యవసాయం రంగంతో పాటు పారిశ్రామికగా అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో యువత, మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. లక్ష కోట్ల రుణాలు అందించేందుకే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. మధిరలో బైపాస్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Telangana: 11ఏళ్లకు దక్కిన న్యాయం.. తల్లిని చంపిన కేసులో జైల్లోనే కొడుకు మృతి..