Site icon NTV Telugu

Rahul Gandhi: ఖమ్మం పర్యటనలో రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ ఇదే..!

Rahul Gandhi

Rahul Gandhi

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజుల పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

Read Also: Revanth Reddy: తెలంగాణ డీజీపీకి పీసీసీ చీఫ్ రేవంత్ ఫోన్.. వెహికిల్స్ నిలిపివేతపై సీరియస్

ఈ సభకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇందుకోసం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు ఆయనను ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం అక్కడ నుంచి రాహుల్ గాంధీ ఖమ్మం సభకు హెలికాప్టర్‌లో రానున్నారు. కర్ణాటక మాదిరి తెలంగాణలోనూ ఆకట్టుకునే పథకాలను రాహుల్ గాంధీ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. సభ ముగిసిన తర్వాత రాహుల్ తిరిగి హస్తినకు పయనం అవుతారు. రోడ్డు మార్గంలోనే ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

Read Also: Assam: అస్సాంలో రూ.11కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్

ఇక రోడ్డు పొడవునా ప్రజలకు రాహుల్ గాంధీ అభివాదం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం కలుస్తారని సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు తెలిపారు. మరి తెలుగు రాష్ర్టాల్లో రాహుల్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version