ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామంలో అన్న కర్రీ రాంబాబుని తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అయితే.. కర్రి రాంబాబు సైకోగా మారి గ్రామస్తులపై పలు దఫాలుగా దాడి చేస్తుండతో రాంబాబుని కాళ్లు చేతులు కట్టేసి కర్రతో తమ్ముడు తీవ్రంగా కొట్టాడు. దీంతో కర్రీ రాంబాబు తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.. గత కొంతకాలంగా సైకోగా కర్రి రాంబాబు ప్రవర్తిస్తున్నాడు అనేది ఆ గ్రామంలో ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Suicide Bomb Blast: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది సైనికులు దుర్మరణం
లింగగూడెం గ్రామంలో కర్రి రాంబాబు ఇప్పటికే పలువురిపై దాడికి దిగడంతో వారిని గాయపర్చినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. దీంతో అన్న కర్రి రాంబాబు చేష్టాలను తట్టుకోలేకపోయిన తమ్ముడు.. అతడిని కట్టేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడిన రాంబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు లాంటి విషయాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. కర్రి రాంబాబు గురించి గ్రామంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Read Also: Bhagavath Kesari: టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం.. గణేష్ టెంపుల్స్ లో సాంగ్ లాంఛ్