NTV Telugu Site icon

Maoist Leader: మవోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో రూ.కోటి రివార్డు వున్న అగ్రనేత..

Maoist Leader

Maoist Leader

Maoist Leader: మావోయిస్టు కీలక నేత మహిళా నక్సలైట్‌ కల్పన అలియాస్ సుజాతను అరెస్ట్ చేశారు. సుజాత మీద కోటి రూపాయల పైగా రివార్డు ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మంలోని ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుండగా పట్టుకున్నారు. సుజాత అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం సుజాత సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆమె కేంద్ర కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కల్పన అలియాస్ సుజాత తోపాటు మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయిలను అదుపులోకి తీసుకున్నారు. సుజాత భర్త కిషన్‌జీ 2011లో పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లోని బురిషోల్‌లో జరిగిన కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.

Read also: Nagarjuna Sagar: సాగర్‌ కు భారీగా వరద.. 8 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల..

కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. కిషన్ జీ భార్య సుజాత కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు ఇప్పుడు 60 ఏళ్లు. సుజాతపై పోలీసులు రూ.కోటి రివార్డు కూడా ప్రకటించారు. మరోవైపు దండకారణ్యం, అబూజ్ మఢ్ అడవుల్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాల నిర్భందం పెరిగాయి. ఈనేపథ్యంలో సుజాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని కొత్తగూడెం ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సుజాత స్వయంగా లొంగిపోయిందా లేదా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారా అనేది స్పష్టంగా తెలియరాలేదు.
KTR Meeting: కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ సమావేశం.. అనంతరం గ్రూప్ వన్ అభ్యర్థులతో మీట్..