NTV Telugu Site icon

Khammam: నేటి నుంచి ఖమ్మంలో రూ.10వేల సాయం.. మూడు రోజుల్లో ప్రక్రియ ముగించనున్న సర్కార్..

Khammam

Khammam

Khammam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేలు అందజేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల తక్షణ సాయం పంపిణీకి ఖమ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బాధితులను గుర్తించేందుకు అధికారులు మూడు రోజుల పాటు సర్వే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 22 వేల కుటుంబాలను వరద బాధితులుగా గుర్తించినట్లు సమాచారం. వీరందరికీ ఇవాళ్టి నుంచి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. మున్నేరు వరదతో అతలాకుతలమైన ఖమ్మం నగర ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Read also: Vinayaka Chavithi 2024: గణేశ చతుర్థి శుభవేళ మిమ్మల్ని కోటీశ్వరులను చేసే “వినాయక సుప్రభాతం

వరదలో కొట్టుకుపోయిన తర్వాత మిగిలిన సామగ్రిని భద్రపరిచారు. బురదమయమైన ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. విలువైన ఆస్తులు, విద్యార్హతలు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలపై సోదాలు చేసి ఎండగడుతున్నారు. మరికొందరు దుకాణాల్లోకి వచ్చిన సామాగ్రిని బయటకు తీసుకొచ్చి ఎండలో ఉంచుతున్నారు. గురు, శుక్రవారాల్లో వర్షాలు కురుస్తుండటంతో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అధికార యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోంది. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం రూరల్ మండలంలో 4 అగ్నిమాపక యంత్రాలు, ఖమ్మం నగరంలో 6 అగ్నిమాపక యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నారు. శనివారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు.
Astrology: సెప్టెంబర్ 07, శనివారం దినఫలాలు

Show comments