Site icon NTV Telugu

Thummala Nageswara Rao: ఖమ్మంలో ఈనెల 15న చారిత్రాత్మకంగా రైతాంగ సభ..

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న వ్యవసాయ రైతాంగ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. వైరా శాంతినగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాలోతు రాందాస్ నాయక్ పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారనిత ఎలిపారు. వైరాలో ఒంటిగంటకు సభ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ పథకాలపై రుణమాఫీ సంబరాలు జరపాలన్నారు. రైతు సదస్సులో శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Read also: Parliament: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం..లోక్‌సభలో తీవ్ర గందరగోళం

ఈ రైతాంగ సభ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలుస్తుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలను అన్ని ప్రాంతాలకు అందించేందుకే సీతారామ ప్రాజెక్ట్ నిర్మించామన్నారు. ఆగస్టు 15న ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జనాలను వైరా రిజర్వాయర్ లోకి అనుసంధానం చేస్తామన్నారు. ఒకవైపు కృష్ణా జలాలు ఒకవైపు గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందటం ఈ ప్రాంత రైతాంగానికి అదృష్టమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పై ఎంతో అభిమానం ఉందని తెలిపారు. జిల్లాను అన్ని రంగాలలో సీఎం సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. రైతు సదస్సును ఈ ప్రాంత రైతులంతా విజయవంతం చేయాలని అన్నారు.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!

Exit mobile version