NTV Telugu Site icon

Khammam: మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. ఫస్టియర్ విద్యార్థికి గుండు కొట్టిచ్చిన వైనం..

Khammam

Khammam

Khammam: క్రమ శిక్షణ పేరిట ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుండు కొట్టించిన ఘటన ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగింది. అయితే ఇది అసిస్టెంట్ ప్రొఫెసరే చేయటంతో వివాదం చెలరేగింది. క్రమశిక్షణ పేరుతో ఈ చర్యకు పాల్పడ్డాడు. దీనిపై వివాదం చెలరేగడంతో ర్యాగింగ్ కమిటీ నిర్వాహన బాధ్యతల నుంచి ఆ ప్రొఫెసర్ ను మెడికల్ కళాశాల ఉన్నతాధికారులు తప్పించారు. ఓ విద్యార్థి తాను భిన్నంగా ఉండేందుకు జుట్టు కటింగ్ చేసుకొని హాస్టల్ కి చేరుకున్నాడు. దీంతో తోటి విద్యార్థులు ఇది పద్ధతి కాదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ తర్వాత ఆ కటింగ్ ని మళ్లీ ఇంకో స్టైల్ లో మార్చుకొని వచ్చాడు. ఈ విషయం తెలిసిన ర్యాగింగ్ కమిటీ ఇన్చార్జి అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని తీసుకుని వెళ్లి గుండు కొట్టించాడు. అయితే ఇది వివాదం కావడంతో ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ నీ ర్యాగింగ్ కమిటీ నిర్వాకం బాధ్యతల నుంచి తొలగించారు. మరింత సమాచారాన్ని ఇంకా తెలియాల్సి ఉంది.
Rice Water: బియ్యం కడ నీళ్లు పడేస్తున్నారా? ఇలా చేయండి..

Show comments