Site icon NTV Telugu

Ponguleti Srinivas Reddy: కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా ఇంటిగ్రేట్ పాఠశాలలు

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: కార్పొరేట్ పాఠశాలకంటే ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేట్ పాఠశాలలను నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం ప్రభుత్వ గిరిజన వసతి గృహాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం కామన్ డైట్ మెనూను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇఛ్ఛిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో పౌల్ట్రీ షెడ్ లలో చదువుకునే పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో ఉందని అన్నారు.

Read also: Bhatti Vikramarka: డైట్ చార్జీల పెంపు చారిత్రాత్మక మైన రోజు

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు మంత్రి. ఇంటి దగ్గర ఫుడ్ కంటే పాఠశాలల్లో పెట్టే ఫుడ్ ఎంతో రుచికరంగా ఉంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలకంటే ధీటుగా ఈ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేట్స్ పాఠశాలలను నిర్మిస్తోందన్నారు. ఆర్థిక వనరులు సహకరించిన కారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయలేక పోతున్నామన్నారు. ఆర్ధిక వనరుల సమకూర్చుకున్న తర్వాత ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తామన్నారు. గతంలో అసంపూర్తి గా వదిలేసిన వాటన్నిటినీ మా ప్రభుత్వం పూర్తిచేస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. పేదోడి పిల్లలు మంచిగా చదవాలనే ఉద్దేశంతో కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందన్నారు. విద్యార్థినీ, విద్యార్థులను తమ పిల్లలుగా చూసుకోవాలని మంత్రి పొంగులేటి ఉపాధ్యాయులకు సూచించారు.
Perni Nani Family in Hiding: అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబ సభ్యులు..!

Exit mobile version