NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పర్యటన..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Hyderabad Hydra: ఖమ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క పర్యటించనున్నారు. నిన్న రాత్రి హుటా హుటిన ఖమ్మం బయలు దేరిన భట్టి విక్రమార్క అక్కడే బస చేశారు. మున్నేరు వాగుకు భారీ వదర రావడంతో ముప్పు ఉండటంతో రాత్రికి రాత్రే ఆయన ఖమ్మం బయలు దేరారు. అయితే నిన్న అర్ధరాత్రి 1 గంటల వరకు ముపు వున్న ప్రాంతాల నుంచి పునరావాసం కల్పించిన బాధితులకు మాట్లాడారు. ఇబ్బందులు లేకుండా బాధితులను చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు ముదిగొండ మండ‌ల కేంద్రంలో ప‌ర్య‌ట‌న కొనసాగనుంది. అక్కడి నుంచి ఉదయం 9.30 గంటలకు మత్కేప‌ల్లి-నామ‌వ‌రంలో ప‌ర్య‌టించనున్నారు. అనంతరం 10 గంటలకు నాగుల‌వంచలో ప‌ర్య‌టించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు బోన‌క‌ల్ లో ప‌ర్య‌టిస్తారు. అక్కడి నుంచి 11.30 గంటలకు మ‌ధిర మండ‌లం దెందుకూరులో చెక్కుల పంపిణ‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్రుపాలెం మండ‌లం బీమ‌వ‌రంలో చెక్కుల పంపిణీ చేయనున్నారు.
Munneru River: మున్నేరుకు మరో వరద ముప్పు..! 16 అడుగులకు నీటిమట్టం..

Show comments