NTV Telugu Site icon

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న(సోమవారం) ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈరోజు ఆయన మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలం తిరుమలాయపాలెం వంతెన, నెల్లికుదురు మండలం రావిరాల వద్ద ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉంది. అయితే సీఎం షెడ్యూల్‌లో ఇవాళ స్వల్ప మార్పులు ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించారు.

Read also: Canada: పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ ఇంటి వెలుపల కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే..

ఇవాళ ముందుగా ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి మహబూబాబాద్‌ జిల్లా లోని పురుషోత్తం గూడెం వరకు రోడ్డు మార్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. కారేపల్లి, గంగారం తండా, కారేపల్లి గేట్, కొత్త కమలాపురం, పుల్లూరు తండా, పొన్నెకల్, డోర్నకల్, సాలార్ తండా నుంచి పురుషోత్తం గూడెం గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీతారాంనాయక్ ఖమ్మం నుంచి నేరుగా తాండాకు చేరుకుంటారు. సుమారు 100 మంది పోలీసులు గ్రామాన్ని వరదలు ముంచెత్తడంతో రక్షించారు. విషయం తెలుసుకున్న సీఎం ముందుగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆ తర్వాత తిరుమలపాలెం వంతెన, రావిరాల గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది.
TGS RTC: భారీ వానలు.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు..

Show comments