దేశంలో నిత్యం రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రోడ్డుప్రమాదం ఎప్పుడు.. ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అయితే ఖాయం. ఒక్కోసారి పెద్ద ప్రమాదం జరిగినా… భూమి మీద నూకలు ఉన్నవాళ్లు బతికి బయటపడతారు. అలా కొన్ని ప్రమాదాలు విషాదాన్ని నింపుతాయి. కొన్ని ప్రమాదాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ రోడ్డుప్రమాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also: ఆంటీ కోసం ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
ఖమ్మం నగరంలోని రావిబజారు సెంటర్ వద్ద ఓ బట్టలషాపులో యజమాని, ఇద్దరు మహిళలు ముచ్చట్లు చెప్పుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఓ పల్సర్ బైక్ షాపులోకి దూసుకువచ్చింది. వేగంగా రావడంతో బైకుపై వ్యక్తి ఎగిరి కౌంటర్‌లో పడ్డాడు. అసలు ఏం జరిగిందో కాసేపటి వరకు అక్కడున్న వారికి అర్థం కాలేదు. తరువాత నెమ్మదిగా వారు తేరుకున్న తర్వాత యువకుడి గురించి ఆరా తీశారు. ఈ ప్రమాదంలో బైకిస్టుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.