NTV Telugu Site icon

Bhatti Vikramarka: నేడు వైరాలో భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: నేడు ఖమ్మం జిల్లాలోని వైరాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు వైరాలో అమృత్ 2.0 పథకం పనులతో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12-30 గంటలకు భట్టి స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఆలయం వద్ద స్నానఘట్టాలు, చెక్‌డ్యామ్‌, ప్రహరీ గోడ నిర్మాణ పనులు, అనంతరం వైరా రిజర్వాయర్, ప్రహరీ గోడ ఆధునిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించనున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులపై ప్రజలతో మాట్లాడి ఆరా తీయనున్నట్లు సమాచారం.

Read also: Hyderabad Crime: పాతబస్తీలో దారుణ హత్య.. కళ్లలో కారం నీళ్లు చల్లి కాల్పులు..

రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ బీట్ ప్రాంతంలో వన మహోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటలకు మొక్కలు నాటారు. అనంతరం అశోక్‌నగర్‌లో డ్రైనేజీలు, పాల్వంచలో సింథటిక్ టెన్నిస్ కోర్టు, కలెక్టరేట్‌లో ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్‌ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 15న పోలీసు కవాతు మై దానంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు. శాఖల వారీగా అభివృద్ధి పనుల వివరాలతో సిద్ధం చేయాలని సూచించారు.
CM Revanth Reddy: నేడు గూగుల్, అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

Show comments