NTV Telugu Site icon

Traffic challan: బైక్ ఒకరిది.. ట్రాఫిక్‌ చలానా మరొకరికి..

Traffic Challan

Traffic Challan

Traffic challan: ట్రాఫిక్‌ నిబంధలు ఉల్లఘించిన వారిపై పోలీసులు చాలాన్‌ విధిస్తూ.. ట్రాఫిక్‌ నిబంధలపై సూచనలిస్తుంటారు. అయినా కొందరు కేటుగాల్లు మాత్రం వారిపని వాళ్లు చేసుకుపోతూ ట్రాఫిక్‌ చలాన్ల బారిన పడుతుంటారు. ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసిన వారికి ట్రాఫిక్‌ చలాన్‌ వస్తే దానికంటూ ఓ అర్థం ఉంటుంది కానీ ఇక్కడ తప్పు చేసింది ఒకరైతే చలానా మరొకరిపై పడింది. అదేంటి అంటారా.. బైక్‌లు రెండు రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రం ఒకటే అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా. ఎస్‌ మీరు వినేది నిజమే.. రెండు బైక్‌లకు ఒకటే రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఉండటంతో ఒకరు చేసిన తప్పుకు మరొకరు బాధ్యత వహించాల్సి వచ్చింది. అంటే.. ఒకరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మరొకరు అపరాధ రుసుం చెల్లించాల్సిన పరిస్థితి రావడం అన్నమాట. ఇలాంటి ఘటన ఎక్కడో కాదండోయ్‌ కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Read also: Delhi Riots Case: ఢిల్లీ అల్లర్లలో ఆప్ కీలక నేతపై మర్డర్ కేసు..

అసలేం జరిగింది..
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన తుమ్మలపూడి పెద్దపుల్లారావుకు హీరో స్పెండరు ఐస్మార్టు బైక్ ఉంది. దాని రిజిస్ట్రేషన్ నెంబరు టీఎస్ 04 ఇసి 8571. సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డులో రాంగ్ పార్కింగు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు ఇటీవల రూ .235 విధిస్తూ ఈ చలాన విధించారు. చలానలో వచ్చిన చిత్రం చూసి పెద్ద పుల్లారావు విస్తుబోయారు. అది పుల్లారావు హీరోహోండా స్పెండర్ ఇస్మార్ట్ బైక్ కాదు..రాయల్ ఇన్ ఫీల్డ్ బుల్లెట్. దాని నెంబరు అచ్చుగుద్దినట్లు తన బండి నెంబరు ప్లేటు లోని అక్షరాలే ఉన్నాయి.దీంతో తన వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని పుల్లారావు పోలీసులను ఆశ్రయించారు.రెండు బైక్ నంబర్ ఒకే లా ఉండటంతో చలానాలు వస్తున్నాయి అని ఇంకేమైనా జరిగితే పరిస్థితి ఎంటి అని పెద్ద పుల్లారావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై సత్తుపల్లి ఎంవీఐ వివరణ అడగటంతో తమకు పోలీసుల నుండి ఎలాంటి ఫిర్యాదు అందలేదని మా దృష్టి లో‌ లేదని చాలా తేలిక తీసేశారు. కల్లూరు ఎస్సై ఇందులో వివరణ ఎముంది ఇంకా రెండు బైకులకు ఒకే నంబర్ ఉండటం సర్వ సాదరాణం అంటూ వివరణ చెప్పకుండానే తోసి పుచ్చడ గమనర్హం. నకిలీ నంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నా వారందరని పోలీసులు చూసి చూడనట్లు వ్యహరిస్తూ నిత్యవసరాల కోసం బయటికి వచ్చిన మద్య తరగతి ద్విచక్ర వాహనాదారులపై ఫైన్ల మీద ఫైన్లు వేస్తూన్నరే తప్ప నకిలీ నంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్న వారిని గుర్తించకుండా సామాన్యులనే టార్గేట్ చేసుకొని ఫైన్లు వేస్తూన్నరని వాహనాదారులు ఆరోపిస్తున్నారు. బాధితుడికి ఎలా ఈ మోటార్ వెహికల్ అధికారులు, పోలీస్ అధికారులు న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే.
Viral Crocodile : వామ్మో వీడి ధైర్యం తగలెయ్యా.. మొసలినే మోసుకెళ్తున్నాడు