Skeleton : ఖమ్మం జిల్లా కుక్కల గుట్టలో గుర్తు తెలియని మహిళ ఆస్తిపంజరం ఖమ్మం జిల్లాలో మరోసారి కలకలం రేపింది. గడిచిన ఐదేండ్లలో ఇదే కుక్కల గుట్టలో తనను ప్రేమించడం లేదని ఒక సైకో.. విద్యార్థినిని హత్య చేశాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేశాడు భర్త. ఈ రెండు సంఘటనలు ఇదే ప్రాంతంలో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అసలు కుక్కల గుట్టపై ఏం జరుగుతోంది?
తాజాగా గుర్తు తెలియని మహిళ అస్థి పంజరం గుర్తించారు. కొత్త లంకపల్లికి చెందిన కొంతమంది పశువుల కాపారులు తమ పశువులు కనపడకపోవడంతో కుక్కల గుట్టలో వెతికారు. అదే సమయంలో గుర్తు తెలియని ఆస్తిపంజరం గుర్తించారు. వెంటనే వీ.ఎం.బంజర్ పోలీసులకు సమాచారం అందించారు…
సత్తుపల్లి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆస్తి పంజరాన్ని పరిశీలించారు. దుస్తుల ఆధారంగా మహిళగా గుర్తించారు. 6 నెలల క్రితం మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇది ఆత్మహత్యా, ప్రమాదమా, లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు…
గుట్టకు రెండు వందల మీటర్ల పైకి గుబురుగా ఉన్న చెట్ల మధ్యలోకి మహిళ ఎందుకు వెళ్లింది. ఇంకా ఎవరైనా సంచరించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పలు పోలీస్ స్టేషన్‌లలో ఐదారు నెలల్లో ఎమైనా మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు…
మరోవైపు గడిచిన ఐదేళ్లలో కుక్కల గుట్టపై 2 హత్యలు జరిగాయి. తనను ప్రేమించడం లేదని ఒక సైకో.. విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను భర్త హత్య చేశాడు. గతంలో జరిగిన ఘటనలను పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాల ద్వారా కేసులను ఛేదించారు. కానీ ఇప్పుడు ఆస్తి పంజరం వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో గడిచిన ఆరు నెలల్లో మిస్సింగ్ కేసులను పరిశీలించి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు…
కుక్కలగుట్ట ప్రాంతం హైవే పక్కన ఉండటంతో మద్యం సేవించడం ఇతర అక్రమ కార్యకలాపాలకు అడ్దగా మారింది. దీంతో హత్యలు కూడా జరుగుతున్నాయంటున్నారు..
