Site icon NTV Telugu

వైరల్‌గా మారిన అసిస్టెంట్ కలెక్టర్ వెడ్డింగ్ ఇన్విటేషన్.. లవ్‌ స్టోరీ మొత్తం..!

ఓ ఐఏఎస్‌ అధికారి వెడ్డింగ్‌ ఇన్వటేషన్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… తొలిచూపు నుంచి పెళ్లి పీటల వరకు జరిగిన తమ లవ్‌ స్టోరీని కవితగా మలచి.. ఓ సినిమా స్టైల్‌లో యాజిమేషన్‌ రూపంలో తయారు చేసిన వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా పని పనిచేస్తున్న రాహుల్‌ది మహబూబ్‌నగర్‌ జిల్లా.. ఈ నెల 10వ తేదీన మనీషా అనే యువతిని పెళ్లిచేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన వెడ్డింగ్‌ కార్డు అదరహో అంటుంది..

Read Also: కరోనా మహమ్మారి.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్‌

రాహుల్‌-మనీషా.. ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు.. ఇక, తొలిచూపు నుంచి జరిగిన వారి ప్రయాణాన్ని మొత్తం షార్ట్‌కట్‌లో చెప్పుకొచ్చారు రాహుల్‌.. బస్సులో వారు కలిసి ప్రయాణం చేయడం.. మొదట ఆకర్షణ.. ఆ తర్వాత మాటలు కలవడం.. బస్సు జర్నీ కాస్తా బైక్‌ ఎక్కడం.. ఎక్కడో తెలియని మొహమాటం.. చివరకు దేవాలయం వద్ద వారి ప్రేమ చిగురించిన విధానం.. ఆ ప్రేమ ముందుకు సాగి.. పెద్దల వరకు చేరడం.. వారు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగిన ఎంగేజ్‌మెంట్‌.. ఫెళ్లి ఫిక్స్‌ చేయడం.. ఇలా అన్నీ వీడియో రూపంలో చూపించారు.. ఈ నెల 10న ఉదయం 11.55 గంటలకు ఐఏఎస్‌ ఆఫీసర్‌ రాహుల్-మనీషా వివాహం మహబూబ్ నగర్‌లో జరగనుంది… మొత్తంగా ఖమ్మం ట్రైనీ కలెక్టర్‌గా పని చేస్తున్న రాహుల్ తన వాయిస్‌తో ఒక్క అందమైన కవితను జోడించి.. ఓ సినిమా స్టైల్‌లో యానిమేషన్‌లో తయారు చేసి ఇన్విటేషన్ కార్డు అందరినీ కట్టిపడేస్తోంది.. కాబోయే కలెక్టర్ రాహుల్‌ చేసిన ఈ ప్రయోగం అందరిని ఆకర్షిస్తోంది…

Exit mobile version