NTV Telugu Site icon

Khairatabad-Balapur Ganesh Live Updates: కొనసాగుతున్న గణేశుని శోభయాత్ర

Khairathabad Balapur

Khairathabad Balapur

Khairatabad-Balapur Ganesh Live Updates: వినాయక చవితి అనగానే హైదరాబాద్ వాసులకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడి భారీ విగ్రహం, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అందరూ ఈ రెండు విషయాల గురించి చర్చించుకుంటారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఇంతై ఇంతింతై వటుడింతై అంటూ దేశవ్యాప్తంగా పాపులర్. వందల నుంచి మొదలైన వేలం ఇప్పుడు లక్షలకు చేరింది. వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారికి మేలు జరుగుతుందని నమ్మకం. దీంతో ఈ లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు వేలంలో పోటీ పడుతున్నారు. ఈ లడ్డూను పొందేందుకు గతంలో లడ్డూలు పొందిన వారు కూడా మళ్లీ మళ్లీ పోటీ పడుతున్నారు.

The liveblog has ended.
  • 28 Sep 2023 08:09 PM (IST)

    వర్షం తగ్గడంతో పెరిగిన సందడి వాతావరణం

    భాగ్యనగరంలో గణనాథుల శోభాయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం కాస్త వర్షం పడటంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన శోభాయాత్ర.. మళ్లీ తిరిగి ప్రారంభమైంది. దీంతో
    చార్మినార్ వద్ద సందడి వాతావరణంగా మారింది. చార్మినార్ వద్ద కోలాహలంగా గణనాధుల నిమజ్జనానికై తరలివెళ్తున్నాయి. చార్మినార్ నుండి మూడు దారుల్లో గణనాథులను పంపిస్తున్నారు పోలీసులు. వర్షంలో కూడా శోభాయాత్ర ఫుల్ జోష్ గా సాగుతుంది. బ్రాస్ బ్యాండ్, డిజే మ్యూజిక్ కి యువత స్టెప్ లు వేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

  • 28 Sep 2023 07:45 PM (IST)

    రంగాధామ్ చెరువు వద్దకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

    మరికాసేపట్లో కూకట్ పల్లి రంగాధామ్ చెరువు వద్దకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెళ్లనున్నారు. నిమజ్జన ఏర్పాట్లు, పరిస్థితిని సీపీ పరిశీలించనున్నారు.
    మరోవైపు రంగధామ్ చెరువు వద్ద సందడి వాతావరణం నెలకొంది. చెరువు ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇదిలా ఉంటే నిమజ్జనానికి గణనాధులు భారీగా తరలివస్తున్నాయి. ఏడు క్రేన్లతో అక్కడ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది.

  • 28 Sep 2023 07:09 PM (IST)

    కూకట్ పల్లిలోని రంగాధామ్ చెరువు వద్ద మూసాపేట్ భారీ గణేష్ నిమజ్జనం

    కూకట్ పల్లిలోని రంగాధామ్ చెరువు వద్ద మూసాపేట్ భారీ గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. క్రేన్ నెంబర్ 6 సహాయంతో నిమజ్జన ప్రక్రియ జరుగుతుంది.

  • 28 Sep 2023 07:05 PM (IST)

    హైదరాబాద్‌ పలుచోట్ల దంచికొడుతున్న వాన

    హైదరాబాద్‌ పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. జోరు వానలోనే గణేశుని శోభయాత్ర జరుగుతోంది.

  • 28 Sep 2023 05:56 PM (IST)

    కూకట్ పల్లిలో అరగంట నుంచి కురుస్తున్న వర్షం

    కూకట్ పల్లిలో అరగంట నుంచి కురుస్తున్న వర్షం. వర్షంలోనూ వినాయక నిమజ్జనానికి రంగాధామం చెరువు వద్ద భక్తుల క్యూ.

  • 28 Sep 2023 05:22 PM (IST)

    గంగమ్మ ఒడిలోకి చేరిన బాలాపూర్‌ గణపతి.

    గంగమ్మ ఒడిలోకి చేరిన బాలాపూర్‌ గణపతి. ట్యాంక్‌బండ్‌పై 13 నంబర్ క్రేన్‌ వద్ద బాలాపూర్ గణేశ్‌ నిమజ్జనం.

  • 28 Sep 2023 05:01 PM (IST)

    హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం.

    హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం. హుస్సేన్‌సాగర్, పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు. సరూర్‌నగర్ మిని ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో వర్షం

  • 28 Sep 2023 04:36 PM (IST)

    ట్యాంక్ బండ్ చేరుకున్న బాలాపూర్ గణేశుడు

    ట్యాంక్ బండ్ వద్దకు కొద్దిసేపటి క్రితం చేరుకున్న బాలాపూర్ గణేశుడు. మరికాసేపట్లో బాలపూర్ గణనాథుడి నిమజ్జనం. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ దాటి సాగర్ వైపు కదిలిన వాహనం.

  • 28 Sep 2023 04:30 PM (IST)

    గణేశుని శోభాయాత్రతో భాగ్యనగరం శోభాయమానం

    గణేశుని శోభాయాత్రతో భాగ్యనగరం శోభాయమానం. ఊరేగింపులతో మారుమోగిపోతున్న భాగ్యనగరం. బందోబస్తు కోసం దాదాపు 40 వేల మంది పోలీసులు. 20 వేలకు పైగా సీసీ కెమెరాలతో అనుక్షణం పహారా.

  • 28 Sep 2023 02:43 PM (IST)

    గణేష్ నిమజ్జన పై ఏరియల్ సర్వే

    గణేష్ నిమజ్జన పై ఏరియల్ సర్వేకి వెళ్ళిన అధికారులు. హోమ్ మినిస్టర్ తో పాటు డిజిపి సీట్లు కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండలో నిమజ్జన ఏర్పాట్లపై ఏరియల్ సర్వే చేపట్టారు. ట్రాఫిక్ సంబంధించి ఏరియల్ ద్వారా అధికారులు వీక్షించనున్నారు.

  • 28 Sep 2023 02:32 PM (IST)

    చార్మినార్ - గుల్జార్ హౌజ్ మీదుగా బాలాపూర్ గణనాథుడు శోభయత్ర

    చార్మినార్ దాటి గుల్జార్ హౌజ్ మీదుగా బాలాపూర్ గణనాథుడు శోభయత్ర సాగుతుంది. చార్మినార్ వద్ద మొదలైన హడావుడి మొదలైంది. గణేశ్ మండపాల నుండి గణనాథులు బయల్దేరారు. చార్మినార్ వద్ద నుంచి గుల్జార్ హౌజ్ మీదుగా గణనాథులు బయలుదేరుతున్నాయి.

  • 28 Sep 2023 01:41 PM (IST)

    చార్మినార్ వద్ద గణేశ్ మండపాల నుండి బయల్దేరిన గణనాథులు

    చార్మినార్ వద్ద మొదలైన హడావుడి మొదలైంది. గణేశ్ మండపాల నుండి గణనాథులు బయల్దేరాయి. చార్మినార్ వద్దకు ఒక్కొక్కటిగా గణనాథులు చేరుకుంటున్నాయి. భాగ్యనగర్‌గణేశ్ ఉత్సవం కమిటి ఆధ్వర్యంలో స్వాగత వేదిక మొదలైంది.

  • 28 Sep 2023 01:26 PM (IST)

    హుస్సేన్ సాగర్ లోని గంగమ్మ చెంతకు ఖైరతాబాద్ మహా గణపతి

    హుస్సేన్ సాగర్ లోని గంగమ్మ చెంతకు ఖైరతాబాద్ మహా గణపతి చేరుకున్నాడు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జన ఘట్టం నేటితో ముగిసింది. నవరాత్రుల పాటు అశేష భక్తజన కోటి పూజలందుకున్న స్వామి వారు నేడు గంగ ఒడికి చేరుకున్నాడు. ఈ మేరకు ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ బుధవారమే అన్ని ఏర్పాట్లు చేసింది. 63 అడుగుల ఎత్తు 40 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అందుకు ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేశారు అధికారులు.

  • 28 Sep 2023 12:09 PM (IST)

    మధ్యాహ్నం 1 గంటకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి

    మహాగణపతి విగ్రహా నిమజ్జనం‌కోసం వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. విగ్రహానికి క్రేన్ వైర్లను జీహెచ్ఎంసీ, పోలీసులు అటాచ్ చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు మంగళ హారతి పూర్తయ్యింది. మధ్నాహ్నం 1 గంటకల్లా నిమజ్జనం పూర్తి చేసేలా ప్రక్రియ ప్రారంభించారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూసేందుకు భక్తులు, సందర్శకులు భారీగా చేరుకున్నారు.

  • 28 Sep 2023 12:05 PM (IST)

    గణేష్ నిమజ్జనం దేశ సమైక్యతను చాటి చెబుతుంది- నిరంజన్ జ్యోతి

    చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి దర్శంచుకున్నారు. గణేష్ నిమజ్జనం దేశ సమైక్యతను చాటి చెబుతుందన్నారు. గతంలో కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతను అప్పగించిందని తెలిపారు. ఆ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

  • 28 Sep 2023 11:39 AM (IST)

    గణేష్ నిమర్జనం శోభ యాత్రలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

    పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి దర్శించుకున్నారు. నగరంలో జరుగుతున్న గణేష్ నిమర్జనానికి కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలో పలుచోట్ల గణేష్ నిమర్జనం శోభ యాత్రలో కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

  • 28 Sep 2023 11:30 AM (IST)

    నగరంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం- సీవీ ఆనంద్

    మధ్యాహ్నం ఒంటిగంటలోపు ఖైరతాబాద్ గణేష్ విగ్రహా నిమజ్జనం పూర్తి అవుతుందని హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గణేష్ నిమజ్జనానికి 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఉన్నారని సీవీ తెలిపారు.

  • 28 Sep 2023 11:23 AM (IST)

    ఎన్టీఆర్ మార్గంలో గందరగోళం.. బ్యారికెడ్లను తోసుకొని లోపలికి వస్తున్న జనం

    ఎన్టీఆర్ మార్గంలో గందరగోళం వాతావరణం నెలకొంది. పోలీసుల బ్యారికెడ్లను తోసుకొని జనం లోపలికి వస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఖైరతాబాద్ వినాయకున్ని చూసేందుకు ప్రజలు భారీ తరలివచ్చారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడు నీ నెమ్మదిగా నిర్వాహకులు కదిస్తున్నారు. సచివాలయం ఈస్ట్ గేట్ వద్దకు ఖైరతాబాద్ మహా గణపతి చేరుకున్నారు. మహా గణపతితో పాటు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. NTR మార్గ్ మొత్తం భక్తులతో కితకిలాడుతుంది. అక్కడ పోలీసులు భారీ కెడ్లను ఏర్పాటు చేయడంతో జనం తోసేసి లోపలికి పరుగులు తీసారు. దీంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

  • 28 Sep 2023 11:14 AM (IST)

    1994 నుంచి 2023 వరకు.. బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే..

    1994లో బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. అయితే 2022లో రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. మరియు 2023 సంవత్సరానికి రూ. 27 లక్షలకు బాలాపూర్ లడ్డూను దాసరి దయానంద రెడ్డి దక్కించుకున్నారు. అయితే 1994 నుంచి 2023 వరకు బాలాపూర్ లడ్డూ ఎవరికి దక్కింది అనేది చూద్దాం.

    బాలాపూర్ నుంచి లడ్డూ వేలం విజేతలు...

    1) కొలన్ మోహన్ రెడ్డి 450/- 1994.

    2 కొలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.

    3)కొలన్ కృష్ణ రెడ్డి 18000/-. 1996.

    4)కొలన్ కృష్ణా రెడ్డి 28000/- 1997.

    5) కొలన్ మోహన్ రెడ్డి 51000/- 1998.

    6) క్రానెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.

    7) కంటి అంజి రెడ్డి 66000/- 2000.

    8) జి. రఘునందన్ చారి 85000/- 2001.

    9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.

    10) చిగురాంత బాల్ రెడ్డి 1,55000/- 2003.

    11) కొలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.

    12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.

    13) చిగురాంత తిరుపతి రెడ్డి 300000 2006.

    14)జి.రగునందన్ చారి 4,15000/- 2007.

    15) కొలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.

    16) సరిత 510000/- 2009.

    17) కోడలు శ్రీధర్ బాబు 535000/- 2010.

    18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.

    19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.

    20) తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.

    21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.

    22) కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.

    23) స్కైలాబ్ రెడ్డి 14,65000 /- 2016.

    24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.

    25) శ్రీనివాస్ గుప్తా 16.60000 /- 2018

    26) పూల్ రామ్ రెడ్డి. 17.50 లక్షలు -2019

    27) కరోనా కారణంగా వేలం జరగలేదు. కానీ ఈ లడ్డూ మాత్రం కేసీఆర్ కుటుంబానికే దక్కింది. 2020

    28.) AP EMMC రమేష్ యాదవ్, శశాంక్ రెడ్డి. రూ.18.90 లక్షలు - 2021

    29) వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలు- 2022

    30) దాసరి దయానంద రెడ్డి 27 లక్షలు -2023

  • 28 Sep 2023 11:13 AM (IST)

    గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఉత్సవ సమితి నిర్వాహకులు

    గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఉత్సవ సమితి నిర్వాహకులు పరిశీలించారు. లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనానికి రానున్నాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు తెలిపారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వానికి ఉత్సవ సమితి తరుఫున భగవంత్ రావు ధన్యవాదాలు తెలిపారు. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా నిమజ్జనాన్నిజరుపుకోవాలని సూచించారు.

  • 28 Sep 2023 10:52 AM (IST)

    బాలాపూర్ లడ్డూ రూ. 27 లక్షలకు దక్కించుకున్న దయానంద రెడ్డి..

    బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. తుర్కయాంజాల్ పాటిగూడ వాసి దాసరి దయానంద రెడ్డి లడ్డు దక్కించుకున్నాడు. రూ. 27 లక్షలకు వేలంలో దాసరి దయానంద రెడ్డి బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ వేలంలో వాళ్ళు 36 మంది పాల్గొననున్నారు. 29 మంది పాతవాళ్ళు.. ఏడుగురు కొత్తవాళ్ళు వేలంలో పాల్గొంటారు. వేలంలో బాలాపూర్ గ్రామస్థులు కాని వాళ్ళు ముగ్గురు పాల్గొననున్నారు. వేలంకు ముందే 25 లక్షలు చెల్లించిన ఇతర ప్రాంతం వాళ్ళు.ఇతర ప్రాంత వాసులు లడ్డూ దక్కించుకోక పోతే వేలం తర్వాత చెల్లించిన డబ్బు వాపస్ ఇవ్వనున్నారు.

  • 28 Sep 2023 10:44 AM (IST)

    బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభం

    బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. బాలాపూర్ లడ్డూ వేలంలో వాళ్ళు 36 మంది పాల్గొననున్నారు. 29 మంది పాతవాళ్ళు.. ఏడుగురు కొత్తవాళ్ళు వేలంలో పాల్గొంటారు. వేలంలో బాలాపూర్ గ్రామస్థులు కాని వాళ్ళు ముగ్గురు పాల్గొననున్నారు. వేలంకు ముందే 25 లక్షలు చెల్లించిన ఇతర ప్రాంతం వాళ్ళు. ఒకవేళ ఇతర ప్రాంత వాసులు లడ్డూ దక్కించుకోక పోతే వేలం తర్వాత చెల్లించిన డబ్బు వాపస్ ఇవ్వనున్నారు. గత ఏడాది బాలాపూర్ లడ్డూ ధర 24 లక్షల 60 వేలు. మరి ఈసారి 25 లక్షలు దాటనున్న బాలాపూర్ లడ్డూ.

  • 28 Sep 2023 10:39 AM (IST)

    సచివాలయం వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ వినాయకుడు

    ఖైరతాబాద్ వినాయకుడు చుట్టూ వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తీన్మార్ డాన్స్ లతో యువత సందడి చేస్తుంది. సచివాలయం ఎదుట ఇసకేస్తే జనం రాలనట్లు పెద్ద ఎత్తున చేరుకున్నారు. NTR మార్గ్ లో భక్త జన సందోహం భారీగా చేరుకున్నారు. భక్తుల రద్దీతో సచివాలయం మార్గం వద్ద కిటకిటలాడుతున్నారు.

  • 28 Sep 2023 10:04 AM (IST)

    సచివాలయ మార్గానికి చేరుకున్న ఖైరతాబాద్ వినాయకుడు

    సచివాలయ మార్గానికి ఖైరతాబాద్ వినాయకుడు చేరుకున్నాడు. ఉదయం 6 గంటలకే శాభాయాత్ర ప్రారంభమైంది. 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు గణనాధుడి నిమజ్జనం పూర్తిచేసేలా అధికారులు ఏర్పాట్లుచేశారు.

  • 28 Sep 2023 09:48 AM (IST)

    బండ్లగూడలో గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు

    హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్‌ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. గణపతి లడ్డూ రూ. కోటి 20 లక్షలు పలికింది. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. గతేడాది ఇక్కడ గణపతి లడ్డూ రూ. 60.80 లక్షలు పలికింది. అయితే ఈసారి మాత్రం అంతకు రెండింతలు ధర పలకడం గమనార్హం. 2021లో కూడా ఇక్కడ గణపతి లడ్డూ రూ. 41 లక్షలు పలికింది.

  • 28 Sep 2023 09:46 AM (IST)

    బాలాపూర్ గణేశుడిని సతీసమేతంగా దర్శించుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి

    బాలాపూర్ గణేశుడిని సతీసమేతంగా ఎంపీ రంజిత్‌రెడ్డి దర్శించుకున్నారు. గతేడాది లడ్డూ విజేత వంగేటి లక్ష్మారెడ్డికి భారత్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. లడ్డూ తయారీదారు ఉమా మహేశ్వరరావుకు భారత్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది.

  • 28 Sep 2023 09:30 AM (IST)

    ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న మంత్రి తలసాని

    ఖైరతాబాద్ గణపతిని మంత్రి తలసాని దర్శించుకున్నారు. ఉదయం 11.00 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, హుస్సేన్ సాగర్ లో బోట్ లో తిరుగుతూ గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షించనున్నారు.

  • 28 Sep 2023 09:29 AM (IST)

    హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌లో సాయంత్రం వరకు 90వేల విగ్రహాలు నిమజ్జనం

    హుస్సేన్‌సాగర్‌, సరూర్‌నగర్‌తో పాటు 33 చెరువుల వద్ద 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 74 బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తున్నారు. కొలనుల వద్ద 27 బోట్స్‌ను సిద్ధంగా ఉంచారు. భక్తులకు మొబైల్‌ టాయిలెట్లు, స్టాటిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కాగా గురువారం సాయంత్రం వరకు 90వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్న అంచనా ఉందని అధికారులు తెలిపారు.

  • 28 Sep 2023 09:28 AM (IST)

    వినాయక నిమజ్జనానికి 256 క్రేన్లు సిద్దం చేసిన అధికారులు

    వినాయక ప్రతిమల నిమజ్జనానికి 256 క్రేన్లను సిద్ధం చేశారు. 3వేల మంది శానిటేషన్‌ సిబ్బందితో పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. కమిషనర్‌ నుంచి శానిటేషన్‌ వర్కర్‌ దాకా మహా నిమజ్జనంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగనుంది. శోభాయాత్రను సజావుగా సాగేలా ఆయా శాఖలు కలిపి మొత్తం రూ.30 కోట్లను ఖర్చు చేశాయి.

  • 28 Sep 2023 09:28 AM (IST)

    మధ్యాహ్నం 1.30 లోపే ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జనం

    బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో రూ. 30 కోట్ల వ్యయంతో సకల వసతులు కల్పించారు. వినాయక నిమజ్జనానికి ఆర్టీఏ 2వేల వాహనాలను ఏర్పాటు చేయగా, జీహెచ్‌ఎంసీ 256 క్రేన్లను సిద్ధం చేసింది. అలాగే పారిశుధ్య నిర్వహణకు 3వేల మంది సిబ్బందిని మూడు షిప్టుల్లో ఏర్పాటు చేశారు. జలమండలి 33.50 లక్షల తాగునీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచగా, ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఉదయం 7గంటలకు మొదలై మధ్యాహ్నం 1.30లోపే ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ నిమజ్జనం పూర్తికానున్నది.

  • 28 Sep 2023 09:25 AM (IST)

    మాదాపూర్ మైహోమ్ భూజాలో రికార్డు స్థాయిలో వినాయకుడి లడ్డు వేలం

    మాదాపూర్ మైహోమ్ భూజాలో రికార్డు స్థాయిలో వినాయకుడి లడ్డు వేలం పాట మొదలైంది. రూ.25 లక్షల 50 వేలకు పోయిన లడ్డు వేలం నుంచి ఎదులకంటి చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వేలంపాట ద్వారా సొంతం చేసుకోగా.. గత సంవత్సరం ఈ లడ్డు వేలం 18 లక్షల 50 వేలకు పలికింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 25 లక్షల 50 వేలు పలికింది.

  • 28 Sep 2023 09:24 AM (IST)

    తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద సందడి

    తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద అప్పుడే సందడి మొదలైంది. తెలంగాణ సచివాలయం చుట్టుపక్కల వినాయకుల సందడి మొదలైంది. నిన్న రాత్రి నుంచి శోభాయాత్రలో ఊరేగింపుగా వచ్చిన గణనాధులు వినాయక్ సాగర్ కి చేరుకుంటున్నాయి. ఈ ఏడాది ఉదయాన్నే ntr మార్గ్ వద్ద సందడి మొదలైంది. ప్రతి ఏడాది 10 గంటల తరువాత హడావుడి ఉండేది... కానీ ఈ ఏడాది చాలా త్వరగా గణేష్ ల సందడి మొదలైంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ ల నిమజ్జనం ప్రస్తుతం జరుగుతుంది.

  • 28 Sep 2023 08:51 AM (IST)

    చార్మినార్ వద్ద కనిపించని హడావుడి

    చార్మినార్ వద్ద ఇంకా హడావుడి మొదలకాలేదు. ఇంకా మండపాలకే గణనాథులు పరిమితమైంది. మధ్యాహ్నం తరువాతే గణనాథులు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాతబస్తీలో సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు మోహరించారు. హైదరాబాద్ లో 25 వేల పై చిలుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. 125 ఫ్లాటూన్ల అదనపు బలగాలు మోహరించారు.

  • 28 Sep 2023 08:44 AM (IST)

    రాజ్ దూత్ హోటల్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

    రాజ్ దూత్ హోటల్ వద్దకు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర చేరుకుంది. మహా గణపతి ముందు భక్తజన సందోహం వేలాదిగా తరలివస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ లో నిదానంగా వినాయక నిమజ్జనం కొనసాగుతుంది.

  • 28 Sep 2023 08:15 AM (IST)

    వడివడిగా సాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

    వడివడిగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర సాగుతుంది. ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ కి శోభాయాత్ర చేరుకున్నారు. ఊరేగింపులో చెట్ల కొమ్మలు, ఓ ఇంటి పైపు అడ్డుగా రావడంతో కాస్త ఆలస్యం కానున్న ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర.

  • 28 Sep 2023 08:13 AM (IST)

    బాలాపూర్ గణేశుడు గ్రామంలోఊరేగింపు ఆలస్యం

    బాలాపూర్ గణేశుడు గ్రామంలోఊరేగింపు ఆలస్యం కానుంది.గ్రామం అంతా ఊరేగింపు అయ్యాక లడ్డూ వేలం మొదలుకానుంది. ఇంకా 200 మీటర్లు దాటని బాలాపూర్ గణేషుడి ఊరేగింపు కొనసాగనుంది. బాలాపూర్ లో ఊరేగుతున్న వినాయకుడికి తమ ఇళ్ళముందు కొబ్బరికాయలు కొట్టి హారతులు పడుతున్న గ్రామస్థులు.

  • 28 Sep 2023 08:10 AM (IST)

    రూ.36 లక్షలకు దక్కించుకున్న కిరణ్ జయరాజ్

    రామరాజు రూ.10 లక్షలకు వేలంపాటను ప్రారంభించగా...లడ్డూను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు కిరణ్ జయరాజ్ రూ. 36 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. రికార్డు స్థాయిలో వేలంలో లడ్డూ కొనుగోలు జరగడం వల్ల గణేష్ ఉత్సవ కమిటీ ఆనందం వ్యక్తం చేశారు.

  • 28 Sep 2023 08:04 AM (IST)

    నల్గొండ పాతబస్తీలో రూ.36 లక్షలు పలికిన లడ్డూ

    గతేడాది రూ.11 లక్షలు పలికిన ఈ లడ్డూ.. ఈ సారి ఏకంగా రూ.36 లక్షలు పలికింది. లడ్డూ వేలం పాటలో నల్గొండ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ నేత నాగం వర్షిత్‌రెడ్డి, పిల్లి రామరాజు, నల్లగొండ జిల్లా అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు, దళిత నాయకుడు పెరిక కిరణ్‌ జయరాజు తదితరులు పాల్గొన్నారు. రామరాజు రూ.10 లక్షలకు వేలంపాటను ప్రారంభించగా...లడ్డూను దక్కించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు.

Show comments