Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy: కోమటి రెడ్డి లాంటి 5మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy

Alleti Maheshwar Reddy: కోమటి రెడ్డి లాంటి 5మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటో ఇంకో అంశమో తన సీటు కు ప్రమాదం వస్తుందనే భయం తో రేవంత్ రెడ్డి కి నిద్రపట్టడం లేదని అన్నారు. పది మంది మంత్రులు సీఎం సీట్ పై కన్నేశారన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డీ నీ తమ్ముడే నీతో టచ్ లో లేడు అట…. అయన భార్యకు టికెట్ రాకుండా మీరే అడ్డుకున్నారు అట..అంటూ హస్యాస్పదం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే లను కొనుక్కుంటే 48 గంటలో నీ ప్రభుత్వం కూలిపోతుంది బిడ్డా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Read also: BRS Party: నిన్న దానం.. నేడు కడియం.. అనర్హత వేటుపై బీఆర్‌ఎస్‌ పిటిషన్‌

ప్రజాస్వామ్య బద్ధంగా మీకు సహకరీస్తున్నమన్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ లు మారితే రాళ్ళతో కొట్టాలని అన్నావు… ఇప్పుడు brs ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నావు… ఇప్పుడు దేనితో కొట్టాలన్నారు. రంజిత్ రెడ్డి నీ విమర్శించావూ అవినీతి ఆరోపణలు చేశావు ఇప్పుడు ఆయనకి ఎలా టికెట్ ఇచ్చావు… ప్రచారం చేస్తారు… రేవంత్ రెడ్డి అన్నారు. విచారణ ల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నవా రేవంత్ రెడ్డి అని తెలిపారు. నీ వసూళ్ల చిట్ట మా దగ్గర ఉంది.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. భువనగిరి ఎంపీ నీ గెలిపించికో దమ్ముంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Read also: NVSS Prabhakar: కేసిఆర్, కేటీఆర్ చెబితేనే బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్ లోకి వస్తున్నారు..

మా ఎమ్మెల్యేలను ముట్టి చూడు… అంటూ సవాల్ విసిరారు. మేము గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోవడానికి 48 గంటలు పట్టదు… కానీ మేము అలా చేయమన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్ది మీరు మా నేతలను కలిసి షిండే లా మారుతానని అన్నావు కదా… మీ మీద నమ్మకం లేదన్నారు. నీ లాంటి 5 మంది మంత్రులు మాతో టచ్ లో ఉన్నారన్నారు. ఆర్ టాక్స్ కింద 3 వేల కోట్లు వసూలు చేశారని తెలిపారు. వెంకట్ రెడ్డి నువ్వు హోమ్ గార్డు లెక్కనే ఉండు స్థాయి నీ మరిచి మాట్లాడకు అన్నారు. తుగ్లక్ చేష్టలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద మా పోరాటం ఉంటుందన్నారు.
Dogs Attacked: రంగారెడ్డిలో దారుణం.. ఇద్దరిపై పిచ్చికుక్కల దాడి..!

Exit mobile version