Nagoba Jatara: నాగోబా జాతరకు తరలివస్తున్న భక్తజనంతో కేస్లాపూర్ పోటెత్తుతోంది. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రెండో రోజు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెస్రం వంశీయులు గోవాడ నుంచి ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ శాఖల ఆధర్యంలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సోమవారం పెర్సపేన్, బాన్‌పేన్ పూజలు,మంగళవారం మండగాజిలి, బేతాళ్ పూజలు ఉంటాయని మెస్రం వంశీయులు తెలిపారు. రేపు కేస్లా పూర్ లో గిరిజన దర్బార్ నిర్వహించనున్నారు. దర్బార్ కు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, ఎమ్మెల్యే లు హాజరు కానున్నారు.
Read also: Metro Train Stopped: మళ్లీ మెరాయించిన మెట్రో.. ఈసారి ఎల్బీనగర్ వైపు..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం (21)న అర్థరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నిన్న నాగోబా జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూటలు నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలాన్ని మట్టికుండలలో మెస్రం వంశ మహిళలు అందిస్తారు.
గిరిజన సాంప్రదాయ డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో పూజాసామాగ్రిని గంగాజలంతో పాటు శోభాయాత్ర నిర్వహించి నాగోబా అలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏడు పుట్టల వద్ద నవ ధాన్యాలు, ఆవు పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర నిన్న రాత్రి 10 గంటలకు నాగోబాకు మహాపూజతో ప్రారంభంకానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు. ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.
Flexis War BRS: అధికార పార్టీలో వర్గ విభేదాలు.. ఫ్లెక్సీల్లో ప్రొటోకాల్ రగడ