Site icon NTV Telugu

KCR: తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్..

Kcr Reaction On Telangana Budget

Kcr Reaction On Telangana Budget

KCR: ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వాయిదా అనంతరం కేసీఆర్ మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ పై మాట్లాడుతూ బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. బట్టి విక్రమార్క బడ్జెట్ ను నొక్కి చెప్పడం తప్ప ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాకు పూర్తి స్థాయి అవగాహన ఉందన్నారు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. బడ్జెట్ లో కొత్తేమీ లేదని తెలిపారు. ఏ సంక్షేమ పథకం ఇందులో లేదని కేసీఆర్ అన్నారు. ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమి కనిపించలేదని అన్నారు.

Read also: Bellamkonda Srinivas: సూరి సినిమా రీమేక్.. ఆ డైరెక్టర్ కి బాధ్యతలు!

ఆరు మాసాలు సమయం ఇవ్వాలని నేను ఇన్నాళ్లు రాలేదన్నారు. పాలసి ఫార్ములా లేదన్నారు. రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని తెలిపారు. రైతు బంధు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతు శత్రు ప్రభుత్వం గా మారింది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత గ్యాస్ తప్ప ఏమిలేదన్నారు. ఐటీ పలసీ ఏమి లేదని తెలిపారు. ట్రాష్ ప్రసంగం లాగానే ఉందన్నారు. పేద ప్రజల పాలసి లేదని తెలిపారు. వ్యవసాయ స్థిరీకరణ లేదని తెలిపారు. స్టోరీ టెల్లింగ్ లాగానే బడ్జెట్ ప్రసంగం మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క పాలసీ మీదా కూడా నిర్దిష్టంగా లేదన్నారు. పద్దతి లేదు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ పై చీల్చి చెందాడుతామన్నారు.

Read also: Snakes In House : ఇల్లా పాముల పుట్టా.. తలుపులు తెరవగానే 26 కొండచిలువలు

రైతుల సంక్షేమానికి ఇచ్చిన బడ్జెట్ ను మేమేధో దుర్వినియోగం చేశామని ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ రైతు శత్రు ప్రభుత్వం అన్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలిపారు. రైతు భరోసా పై ప్రస్థావన లేదన్నారు. రైతులను, వృత్తి కార్మికులను ఈ ప్రభుత్వం వంచించిందని తెలిపారు. ఇండస్ట్రియల్ పాలసి వట్టి గ్యాస్ అన్నారు. ఈస్ట్ మన్ కలర్ స్టోరీ టెల్లింగ్ లా ఈ బడ్జెట్ ఉందన్నారు. రాజకీయ ప్రసంగంలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశానికి పద్ధతీ పద్దూ లేదన్నారు. ఇది పెదాల బడ్జెట్ కాదు.. బడ్జెట్ పై మున్ముందు చీల్చి చెందడుతామన్నారు.
Bellamkonda Srinivas: సూరి సినిమా రీమేక్.. ఆ డైరెక్టర్ కి బాధ్యతలు!

Exit mobile version